Indian 2 Audio Launch Event : ఇండియన్ 2 ఆడియో లాంచ్ కి గెస్టులుగా ముగ్గురు మెగా సౌత్ స్టార్స్ ?

Indian 2 Audio Launch Event : కమల్ హాసన్ నటిస్తున్న తాజా మూవీ ఇండియన్ 2 నిస్సందేహంగా 2024లో విడుదల కానున్న అత్యంత భారీ అంచనాలున్న సినిమాలలో ఒకటి. ఈ మూవీ రిలీజ్ తో సహా షూటింగ్ వంటి విషయాల్లో చాలా సంవత్సరాలుగా సమస్యలను ఫేస్ చేసింది. చివరకు అతి త్వరలో సిల్వర్ స్క్రీన్‌ పైకి రావడానికి రెడీగా ఉంది. ఈ నేపథ్యంలోనే మరో వారం రోజుల్లో జరగనున్న ఇండియన్ 2 ఆడియో లాంచ్ ఈవెంట్ కు ముగ్గురు మెగా సౌత్ స్టార్స్ గెస్టులుగా రాబోతున్నారని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మరి ఆ ముగ్గురు హీరోలు ఎవరు? అనే వివరాల్లోకి వెళ్తే..

ఆడియో లాంచ్ కి గెస్టులుగా ముగ్గురు స్టార్స్

ఇండియన్ 2కు సంబంధించిన ఆడియో లాంచ్ ఈవెంట్ కు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలయ్యాయి. మేకర్స్ జూన్ 1న గ్రాండ్ గా ఆడియో లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇండియన్ 2 ఆడియో లాంచ్ ఈవెంట్ ను గ్రేస్ చేయడానికి సౌత్ సూపర్ స్టార్స్ ని ఆహ్వానించారని సమాచారం. వాళ్ళు మరెవరో కాదు సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇండియన్ 2 ఈవెంట్ కు గెస్టులుగా విచ్చేయబోతున్నారు. అలాగే అనిరుధ్ రవిచందర్ కూడా ఈవెంట్‌లో లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. కానీ ఈ విషయం గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Kamal Haasan’s Indian 2 MEGA audio launch to have THESE South superstars as chief guests

- Advertisement -

ఆడియో లాంచ్ ఈవెంట్ ఎక్కడంటే?

ఇండియన్ 2 ఆడియో లాంచ్ ఈవెంట్ సిసినిమాకి సంబంధించిన భారీ ప్రమోషనల్ ఈవెంట్‌ కాబోతోంది. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఆడియో లాంచ్‌ను భారీ స్థాయిలో నిర్వహించి సినిమాపై భారీ అంచనాలను పెంచాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రజినీకాంత్ వల్ల కోలీవుడ్, చిరు వల్ల టాలీవుడ్, చెర్రీ వల్ల పాన్ ఇండియా రేంజ్ లో మూవీకి ప్రమోషన్ దక్కుతుందనే ఈ ముగ్గురినీ అతిథులుగా ఆహ్వానించారని అంటున్నారు.

ఆడియో లాంచ్ తోనే హైప్

గ్రాండ్ ఆడియో లాంచ్ భారీ పాన్-ఇండియన్ చిత్రాలకు కొత్త ట్రెండ్ గా మారింది. ఇటీవల రిలీజైన జైలర్ సినిమాతోనే ఈ ట్రెండ్ మళ్లీ మొదలైంది. జైలర్ ఈవెంట్ లో రజినీ స్పీచ్ నుండి అనిరుధ్ లైవ్ పర్ఫార్మెన్స్ వరకు ప్రతిదీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రంపై పెద్ద ఎత్తున హైప్‌ను సృష్టించింది. మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంలో ఈ ఈవెంట్ కూడా కీలకపాత్రను పోషించింది. అలాగే ఇప్పుడు ఇండియన్ 2 విషయంలో కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు మేకర్స్.

ఇండియన్ 2 రిలీజ్ జూలైలో..

శంకర్ షణ్ముగం రచించి, దర్శకత్వం వహించిన తమిళ భాషా చిత్రం ఇండియన్. ఇందులో కమల్ హాసన్, మనీషా కొయిరాలా ప్రధాన పాత్రల్లో నటించగా, 1996లో రిలీజై సూపర్‌ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఇండియన్‌కి సీక్వెల్ గా ఇండియన్ 2 తెరపైకి రాబోతోంది. జూలై 12న తెలుగు, కన్నడ, హిందీ మరియు మలయాళంలో కూడా విడుదల కానుంది.

ఈ చిత్రంలో కమల్‌తో పాటు సిద్ధార్థ్, ఎస్‌జె సూర్య, కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్, బ్రహ్మానందం, మనోబాల, వివేక్, నేదురుమూడి వేణు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు, ఇందులోని మొదటి సింగిల్‌ని ఇటీవలే మేకర్స్ రిలీజ్ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు