Dunki Collections : దెబ్బ పడినా పరువు దక్కించుకున్నారు..

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో నటించిన మూవీ ‘డుంకి’. ఈ సినిమా డిసెంబర్ 21న రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మిక్సడ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే రిలీజ్ కి ముందు డుంకి మూవీ పై భారీ అంచనాలున్నాయి. పైగా రాజ్ కుమార్ హిరానీ ట్రాక్ రికార్డ్ తెలిసిందే. అయితే రిలీజ్ అయ్యాక మాత్రం అంచనాలన్నీ తారుమారయ్యాయి. ఈ సారి రాజ్ కుమార్ కార్క్ పనిచేయలేదు. పైగా ప్రభాస్ సలార్ మూవీ పోటీగా రావడంతో ఆడియన్స్ ఫోకస్ మొత్తం ఆ సినిమాపైకి పోయింది.
దాంతో డుంకి సినిమాకి చాలా తక్కువ ఓపెనింగ్స్ దక్కాయి.

డుంకి రిలీజ్ అయిన ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా కేవలం 60 కోట్ల ఓపెనింగ్స్ మాత్రమే దక్కించుకుంది. అయితే సినిమాకి వచ్చిన టాక్ ని బట్టి ఇవి నిజానికి మంచి ఓపెనింగ్సే అయినా షారుఖ్ రీసెంట్ మూవీలతో పోల్చితే చాలా తక్కువ. ఇక నెటిజన్లు ఈ సినిమాకి భారీ నష్టాలు తప్పవని అనుకున్నారు.

అటు సలార్ వీకెండ్ లో భారీ వసూళ్లతో అదరగొడుతుంటే డుంకి మాత్రం అందులో సగం కూడా రాబట్టలేకపోయిందని నెటిజన్లు అనుకున్నారు. అయితే డుంకి సినిమా రిలీజ్ అయ్యి వారం రోజులు పూర్తవగా, ఫస్ట్ వీక్ కలెక్షన్లు చూసి షాక్ అయ్యారు నెటిజన్లు. ఎందుకంటే డుంకి ఫస్ట్ వీక్ పూర్తయ్యే సరికి వరల్డ్ వైడ్ గా 304 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఫస్ట్ డే పూర్ ఓపెనింగ్స్ దక్కించుకున్న డుంకి వీకెండ్ లో పుంజుకుంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో డుంకి భారీ వసూళ్లు అందుకుంది.

- Advertisement -

ఇక సలార్ వల్ల డుంకి కి ఓపెనింగ్స్ పరంగా భారీ దెబ్బపడినా ఓవర్సీస్ ఆడియన్స్ అండతో మిక్సడ్ టాక్ తో కూడా డీసెంట్ వసూళ్లు అందుకుందని షారుఖ్ పరువు కాపాడిందని చెప్పొచ్చు. అంటే బాలీవుడ్ పరువు కూడా కొంచెం దక్కినట్టే. ఇక లాంగ్ రన్ లో గనుక డుంకి ఆడితే 500 కోట్ల మార్క్ ని కూడా క్రాస్ చేయొచ్చు. మరి ఓవరాల్ గా డుంకి ఎంత వరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos,and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు