Dunki: ‘సలారోడి’ చేతిలో దెబ్బతిన్నా పోరాడుతున్నాడు.?

పాన్ ఇండియా వైడ్ గా ఈ డిసెంబర్ లో రెండు బడా సినిమాలు పోటీగా రిలీజ్ అయ్యాయన్న సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన “సలార్” కాగా, మరొకటి కింగ్ షారుఖ్ ఖాన్ నటించిన “డుంకి”. సలార్ ని కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయగా, డుంకి ని బాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ డైరెక్ట్ చేసాడు. ఇద్దరూ పాన్ ఇండియా బడా డైరెక్టర్లే కావడం విశేషం.

అయితే వీళ్లు డైరెక్ట్ చేసిన ఈ రెండు సినిమాలు అనగా డిసెంబర్ 21న డుంకి, 22న సలార్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకున్నాయి. డుంకి డీసెంట్ టాక్ తెచ్చుకోగా, సలార్ మాస్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే రిలీజ్ కాకముందు నుండి ఈ రెండు సినిమాల్లో ఎక్కువ హైప్ ఉంది కూడా సలార్ కే. పైగా మాస్ సినిమా కావడంతో ఆడియన్స్ ఈ సినిమావైపే ఎక్కువ మొగ్గు చూపారు. ఇక సలార్ ప్రీమియర్స్ నుండే మమ్మోత్ కలెక్షన్లతో దుమ్ములేపుతుంది.

ఇప్పటివరకు 450 కోట్లకి పైగా వసూలు చేయగా 600 కోట్ల దిశగా దూసుకుపోతుంది. ఇక దీనికి పోటీగా రిలీజ్ అయిన డుంకి మాత్రం యావరేజ్ ఓపెనింగ్స్ ని తెచ్చుకుంది. ఇక నెటిజన్లు కూడా సలార్ దాటికి తేరుకోవడం కష్టమే అని అనుకున్నారు. కానీ డుంకి ఓవర్సీస్ ఆడియన్స్ హెల్ప్ తో వీకెండ్ లో మెల్లగా గ్రోత్ చూపించింది.

- Advertisement -

ఇక రిలీజ్ అయిన 6 రోజుల్లో ఈ సినిమా 280 కోట్లకి పైగా వసూలు చేసి 400 కోట్ల దిశగా దూసుకుపోతుంది. ఈ విధంగా సలారోడు దెబ్బతీసిన డుంకి ఓవర్సీస్ ఆడియన్స్ అండతో పోరాడుతున్నాడనే చెప్పాలి. అయితే లాంగ్ రన్ లో అయితే ఆడదని చెప్పొచ్చు. మరి డుంకి ఎండ్ అయ్యే సరికి ఓవరాల్ గా ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos,and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు