Saindhav: సాంగ్ అప్డేట్ ఇద్దామనుకుని స్టోరీ హింట్ ఇచ్చేసారా?

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి రాబోతున్న సినిమాల్లో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న ‘సైంధవ్‌’ కూడా ఒకటి. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుండే ప్రేక్షకుల్లో అంచనాలు మొదలైపోయాయి. ఎందుకంటే హిట్ దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాని డైరెక్ట్ చేయగా, ఒక సెన్స్ ఫిక్షన్ డ్రామాగా సైంధవ్‌ తెరకెక్కింది. పైగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి ఇప్పటి వరకు వచ్చిన టీజర్ పాటలతో సహా ప్రతిదీ సినిమాపై అంచనాలు పెంచేసాయి.

ఇక సైంధవ్‌ సినిమా రిలీజ్ డేట్ దగ్గరవుతున్న కొద్దీ మూవీ మేకర్స్ కూడా ప్రమోషన్లపై ద్రుష్టి పెట్టారు. అయితే సైంధవ్‌ మేకర్స్ తాజాగా ఓ సాంగ్ అప్డేట్ ని ఇవ్వడం జరిగింది. ఈ సినిమాలో మూడో సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించగా, ఆ సాంగ్ కోసం ఇచ్చిన అప్డేట్ పోస్టర్ లో మేకర్స్ సైంధవ్‌ సినిమా స్టోరీ పై హింట్ ఇచ్చేసినట్టు అనిపిస్తుంది. రిలీజ్ చేసిన పోస్టర్ లో హీరో కూతురితో ఉన్న స్టిల్ ఉండగా, ఆ స్టిల్ లో పాప ముఖంపై ఆక్సిజన్ మాస్క్ ఉంది. పైగా ఆ స్టిల్ లో వెంకీ ఎమోషనల్ గా పాపను గుండెలకు హత్తుకున్నాడు.

దీన్ని బట్టి సినిమా కథ నేపథ్యం పాప చుట్టునే తిరుగుతుందని, ఆ పాప కోసమే సైంధవ్‌ విలన్లతో యుద్దానికి దిగుతాడని తెలుస్తుంది. పైగా ఆ పాపకి వచ్చిన హెల్త్ ఇష్యూ బహుశా విలన్ల వల్లే కలిగి ఉంటుంది. టీజర్ రిలీజ్ చేసినపుడు కూడా అందులో మెడికల్ మాఫియా గురించి చూపించడం జరిగింది. ఒకవేళ స్టోరీ నేపథ్యం ఇదే అయినా దాన్ని, డైరెక్టర్ శైలేష్ కొలను ఆడియన్స్ కి తన స్క్రీన్ ప్లే తో ఎంత వరకు కనెక్ట్ చేయగలడో చూడాలి.

- Advertisement -

For More Updates : Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు