Mrunal Thakur : మూడింట్లోనూ ఒకే పాత్ర చేసిన మృణాల్!

Mrunal Thakur : టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్ ఒకరు. బాలీవుడ్ లో సీరియల్స్ లో నటిస్తూ సినిమాల్లోకి వచ్చిన ఈ హీరోయిన్ అసలైన గుర్తింపు తెచ్చుకుంది మాత్రం టాలీవుడ్ లోనే. రెండేళ్ల కింద సీతారామం వంటి క్లాసిక్ బ్లాక్ బస్టర్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత హాయ్ నాన్న, లేటెస్ట్ గా ఫ్యామిలీ స్టార్ లో నటించింది. ఇక బాలీవుడ్ లో పలు చిత్రాలు చేసినా, సక్సెస్ వచ్చినా తెలుగులో వచ్చినంత క్రేజ్ గాని గుర్తింపుగాని రాలేదు. అందుకే ఇక్కడ తక్కువ సినిమాలు చేసినా టాలీవుడ్ లోనే ఎక్కువ సందడి చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ ఈవెంట్ లో తెలుగు ప్రేక్షకులకు సాష్టాంగ నమస్కారం చేసిందంటే తెలుగు ప్రేక్షకులకు, టాలీవుడ్ కు ఎంత గౌరవం ఇచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తెలుగులో మూడే మూడు చిత్రాలు చేసింది. కానీ కావాల్సినంత క్రేజ్ సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్ల రేంజ్ లో ఫ్యాన్ బేస్ దక్కించుకుంది. సీతారామంలో సీతగా, హాయ్ నాన్నలో యష్ణగా, తాజాగా ఫ్యామిలీ స్టార్ లో ఇందు గా తన అందం, అభినయంతో అలరించింది.

ఫ్యామిలీ స్టార్ తో బ్రేక్..

అయితే మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) తాజాగా విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ నెగిటివ్ టాక్ అందుకుంది. ఈ మూవీతో మృణాల్ ఠాకూర్ హ్యాట్రిక్ హిట్ కొడుతుందని అంతా అనుకున్నారు. కానీ ఈ అమ్మడి సక్సెస్ జోష్ కు ఫ్యామిలీ స్టార్ సినిమా బ్రేక్ వేసింది. అయితే డైరెక్టర్ రాసిన స్క్రిప్ట్, అలాగే తన పాత్రకు మాత్రం తన వంతు న్యాయం మాత్రం చేసింది. అందుకే సినిమాలో విజయ్ దేవరకొండ మీద ట్రోల్స్ పడ్డా మృణాల్ ఠాకూర్ కి మాత్రం మంచి పేరు వచ్చింది. సినిమాలో ఫస్ట్ హాఫ్ లో సరదాగా ఉంటూనే, సెకండాఫ్ లో భావోద్వేగాలను బాగా పండించింది. కానీ దర్శకుడు పరశురామ్ ఆమె రోల్ ను సినిమాకు తగ్గట్టు డెవలప్ చేయడంలో ఫెయిల్ అయ్యారని చెప్పాలి. అయితే టాలీవుడ్ లో ఇప్పటి వరకు మృణాల్ ఠాకూర్ చేసిన మూడు సినిమాల్లో తన పాత్రలు ఒకే జోనర్ కు చెందినవి కావడం గమనార్హం.

మూడు చిత్రాల్లో ఒకే తరహా పాత్ర..

మృణాల్ ఠాకూర్ తెలుగులో చేసిన ఈ మూడు సినిమాల్లో ఆల్మోస్ట్ ఒకే తరహా పాత్ర చేసింది. మూడు సినిమాల్లో కూడా ఒక మిడిల్ క్లాస్ యువకుడితో ప్రేమలో పడిపోయే ధనిక యువతిగా నటించింది. క్యారెక్టర్ పరంగా మూడు సినిమాల్లోని రోల్స్ సేమ్ కానప్పటికీ, బేసిక్ కాన్సెప్ట్ ఒకటే అవ్వడం విశేషం. అయితే ఆయా పాత్రల వేరియషన్స్ మాత్రం వేరేగా ఉంటుంది. ముఖ్యంగా సీత రోల్ మాత్రం మృణాల్ కి రాదని చెప్పాలి. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. హీరోయిన్ గా నటనలో మంచి టాలెంట్ ఉన్న మృణాల్ ఠాకూర్ మూడు చిత్రాలలో సేమ్ జోనర్ కు చెందిన క్యారెక్టర్లను సెలెక్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇది యాదృచ్చికంగా జరిగి ఉండవచ్చని కూడా అంటున్నారు. అయితే ఈ పొరపాట్లని సరిదిద్దుకుని సెలక్షన్ లో కొత్త తరహా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ట్రేడ్ విశ్లేషకులు సజ్జెస్ట్ చేస్తున్నారు. అయితే సినిమాల విషయంలో ఏమాత్రం తొందరపడట్లేదు ఈ బ్యూటీ. పలువురు హీరోయిన్లలా చేతి నిండా ప్రాజెక్టులు పెట్టుకుని బిజీగా ఉండకుండా, తెలుగు సినిమాలు చేస్తూనే ఇతర ఇండస్ట్రీలలో కూడా అవకాశాలు దక్కించుకుంటోంది. మరి మృణాల్ ఠాకూర్ నెక్స్ట్ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు