Trivikram about Devara Movie : దేవరనామ సంవత్సరంగా ప్రకటిస్తున్న

కాలం మారుతున్న కొద్ది సినిమా తీసే విధానం సినిమా చూసే విధానం మారిపోయింది అని చెప్పొచ్చు. ఒకప్పుడు సినిమా అంటే ప్రాపర్ గా ఒక కథ, పకడ్బందీగా స్క్రీన్ ప్లే, అద్భుతమైన డైలాగ్స్, ఆకట్టుకునే విజువల్స్ మంచికి కిక్ ఇచ్చే ఫైట్స్ ఇలా చాలా ఉండేవి. కానీ ఇప్పుడు ఒక మామూలు కథకి అద్భుతమైన ఫన్ యాడ్ చేసి ఆ సినిమాను తెరకెక్కిస్తే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు సాధిస్తుంది. ఇక రీసెంట్ టైమ్స్ లో అలా మంచి హిట్ సాధించి మంచి వసూళ్లను సాధించిన చిత్రాలు చాలా ఉన్నాయి.

ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 100 కోట్ల సినిమా రావటం అనేది గగనం. ఇప్పుడు ఒక మంచి అవుట్ పుట్ తో ప్రేక్షకులు ముందుకు వస్తే 100 కోట్ల సినిమా కూడా సాధ్యమే అని నిరూపిస్తున్నాయి కొన్ని సినిమాలు. ఇప్పుడున్న ఏం హీరోస్లో చాలామంది పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సాధించుకుంటున్నారు. అలానే పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ చేసిన సినిమా కార్తికేయ ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును సాధించుకున్నాడు నిఖిల్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కోట్లు వసూలు చేసింది.ఇప్పుడు చందు నాగచైతన్యతో తండేల్ అనేసినిమాలు చేస్తున్నాడు.

ఇకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలలో సిద్దు జొన్నలగడ్డ ఒకరు. ముందుగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించిన సిద్దు తనకు తాను ఒక గుర్తింపును సాధించుకొని నేడు తనకంటూ సొంత మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. సిద్దు ఎన్ని సినిమాలు చేసినా కూడా సిద్దుకు మంచి బ్రేక్ తీసుకొచ్చిన సినిమా డీజే టిల్లు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్ సాధించింది. ఈ సినిమాకు సీక్వల్ గా టిల్లు స్క్వేర్ అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 100 కోట్లను వసూలు చేసింది. సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ అతిథులుగా హాజరయ్యారు.

- Advertisement -

అయితే ఈ సినిమా గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ వచ్చారు. డిజె టిల్లు సినిమా మా ఇంట్లో మొదటి నరేషన్ విన్నప్పుడు నుంచి ఆ సినిమా పైన మంచి నమ్మకం కుదిరింది అంటూ చెప్పుకొచ్చాడు త్రివిక్రమ్. ఇకపోతే ఇదే వేదికపై ఎన్టీఆర్ కూడా ఉండటంతో దేవర సినిమా గురించి కూడా చెప్పుకొచ్చాడు త్రివిక్రమ్ ఈ ఏడాదిని దేవరనామ సంవత్సరంగా ప్రకటిస్తున్నాను అంటూ మాట్లాడారు త్రివిక్రమ్. ఈ సినిమాకు 1000 కోట్లు రావాలంటే చెప్పుకొచ్చాడు.ఎన్టీఆర్ అభిమానులకు త్రివిక్రమ్ మాటలు చాలా జోష్ ను ఇచ్చాయి.

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర. ఈ సినిమాను అక్టోబర్ నెలలో రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్ కూడా అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా చివరి దశలో ఉంది. ఎన్టీఆర్ అభిమానులకు మాత్రమే కాకుండా ప్రేక్షకులు కూడా ఈ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు