Tollywood BoxOffice : అందరి కళ్ళు అక్టోబర్ పైనే… మళ్ళీ బాక్స్ ఆఫీస్ వార్ తప్పదా?

Tollywood BoxOffice : అక్టోబర్ నెలలో బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేయడానికి స్టార్ హీరోలు అందరూ రెడీ అవుతున్నారు. సమ్మర్ సీజన్ ను వదిలేసి, అందరూ అక్టోబర్ నెలపైనే పడ్డారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే ఈ ఏడాది సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద జరిగిన ఫైట్ గుర్తుకు వస్తోంది. మరి అక్టోబర్ లో కూడా ఇదే సీన్ రిపీట్ కాబోతోందా? ఇంతకీ అక్టోబర్ లో రాబోతున్న స్టార్ హీరోల సినిమాలు ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

సమ్మర్ మొత్తం ఖాళీ…

ఏప్రిల్, మే, జూన్ వంటి సమ్మర్ నెలలన్నీ పెద్ద హీరోల సినిమాలు లేకుండానే గడిచిపోబోతున్నాయి. ఐపీఎల్, ఎలక్షన్ సీజన్ కారణంగా ఈ కాసులు కురిపించే సినిమా సీజన్ ను లైట్ తీసుకున్నారు స్టార్ హీరోలు. ఒక్క “కల్కి”మాత్రమే ఈ ఏడాది వేసవి కాలం హాలిడేస్ ను ఉపయోగించుకోబోతుందని ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఇక మరోవైపు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఒకదాని తర్వాత ఒకటి పెద్ద సినిమాలన్నీ రిలీజ్ కు క్యూ కడుతున్నాయి.

సెప్టెంబర్ చివరి నుంచి స్టార్ట్…

సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 31 వరకు కేవలం 35 రోజుల్లోనే 6 భారీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. దీంతో సిని ప్రియులకు ఈ నెల రోజులు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతోంది. ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ వార్ ను మొదలు పెట్టబోతున్నాడు. సుజిత్ దర్శకత్వం వహించిన గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా ఓజీలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని సెప్టెంబర్ 27న రిలీజ్ చేయబోతున్నారు. ఆ తర్వాత లైన్ లో ఉన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర ఫస్ట్ పార్ట్ అక్టోబర్ 10న రిలీజ్ కాబోతోంది. అదే రోజున నాగచైతన్య కూడా ఎన్టీఆర్ కు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ ఇవ్వబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ మూవీ అక్టోబర్ 17న రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్. ఇక రాంచరణ్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ భారీ బడ్జెట్ మూవీ అక్టోబర్ 31న థియేటర్లలోకి దిగబోతోంది.

- Advertisement -

వీళ్లకు క్లారిటీ లేదు…

అక్టోబర్ నెలపైనే కన్నేసిన వారిలో కొంతమంది అరవ హీరోలు, మరికొంత మంది తెలుగు హీరోలు కూడా ఉన్నారు. కాకపోతే వీళ్ళ సినిమా రిలీజ్ డేట్ లపై క్లారిటీ లేదంతే. సూర్య ప్రతిష్టాత్మక మూవీ కంగువాను అక్టోబర్ లో రిలీజ్ చేయబోతున్నామని అనౌన్స్ చేశారు. కానీ ఇంకా రిలీజ్ డేట్ రాలేదు. అలాగే రజనీకాంత్ హీరోగా టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న వేట్టాయన్ మూవీని కూడా అక్టోబర్ లోనే థియేటర్లలోకి తీసుకురాబోతున్నామని అనౌన్స్ చేశారు. మరోవైపు బాబి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఎన్బికె 109 మూవీని సెప్టెంబర్ లేదా అక్టోబర్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా సమాచారం. మరి వీటిలో ఏ సినిమా మరో సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద ఢీకొన్నా బీభత్సం మాత్రం తప్పదు. మరి ఈ దసరా బాక్స్ ఆఫీస్ బరిలో విన్నర్ గా నిలిచేది ఎవరో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు