Akshay Kumar : ట్రైలరే కొంపముంచింది.. ఊహించిందే జరుగుతుందా?

Akshay Kumar : బాలీవుడ్ లో ఈ ఇయర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపడం లేదన్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో మొన్న షాహిద్ కపూర్ సినిమా, నిన్న అజయ్ దేవగన్ సైతాన్ సినిమా, లేటెస్ట్ గా లేడీ ఓరియెంటెడ్ సినిమా క్రూ. ఈ మూడు హిట్స్ తప్పా, బాలీవుడ్ లో ఇప్పటివరకు సరైన హిట్టు లేదు. అయితే వరుస బెట్టి బడా సినిమాలైతే రిలీజ్ అవుతూనే ఉన్నాయ్. కానీ హిట్లు మాత్రం రావడం లేదు. ఇదిలా ఉండగా ఈ ఇయర్ రంజాన్ ఈద్ కానుగగా రెండు భారీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అందులో ఒకటి ‘బడే మియా చోటే మియా’. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లు కలిసి నటించిన ఈ మల్టీ స్టారర్ సినిమా ఎప్రిల్ 11న ఈద్ కానుకగా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా షో టికెట్స్ బుక్ మై షో లో ఇప్పటికే మొదలయినా సరైన బుకింగ్స్ మాత్రం జరగట్లేదు. దానికి కారణం ట్రైలరే అని టాక్ నడుస్తుంది.

ట్రైలర్ వల్లే నెగిటివిటి?

అయితే మామూలుగా ఒక సినిమాని మార్కెట్ చేయడంలో అంచనాలు పెంచడంలో ట్రైలర్ పాత్ర చాలా కీలకం. దీని వల్లే ఒక్కోసారి బిజినెస్ లెక్కలు అమాంతం పెరిగిపోతాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ విషయంలో రాజమౌళి అంత శ్రద్ధ తీసుకోబట్టే రిలీజ్ ముందు నుంచే హైప్ ని రెట్టింపు చేశాయి. ఒకవేళ తేడా కొడితే ఏం జరుగుతుందనే దానికి బాలీవుడ్ మూవీ ‘బడేమియా చోటే మియా’ నిలుస్తోంది. వాస్తవానికి ఏప్రిల్ 10 విడుదల కావాల్సిన ఈ యాక్షన్ మల్టీస్టారర్ ఇప్పుడు ఒకరోజు వాయిదా పడి ఏప్రిల్ 11 రానుంది. కారణం ఏటంటే ఆశించిన దానికి చాలా తక్కువగా అడ్వాన్స్ బుకింగ్స్ ఉండటమని తెలుస్తుంది. ఇక రంజాన్ పండగ ఏప్రిల్ 11 రానుంది. ఉపవాస దీక్షలు పూర్తి చేసుకుని ముస్లింలు ఆ రోజు నుంచి థియేటర్లకు వస్తారు. అయితే ఒకవేళ 10నే బడేమియా చోటేమియాకు నెగటివ్ టాక్ వస్తే అక్కడితో అక్కడే ఎండ్ కార్డు పడిపోతుంది. సమస్యల్లా రొట్ట రొటీన్ గా తీసిన ట్రైలర్ వల్ల జరిగిందని ట్రేడ్ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. ఎలాంటి కొత్తదనం ఫీలవ్వకుండా అక్షయ్ కుమార్(Akshay Kumar), టైగర్ ష్రాఫ్ ఉంటే చాలనే ధీమాతో రెగ్యులర్ ఎలిమెంట్స్ తో నింపేయడం వల్ల బజ్ తెచ్చుకోవడంలో విఫలమయ్యిందని అభిప్రాయపడుతున్నారు.

పదికోట్లయినా వస్తాయా?

అయితే చోటే మియా బడే మియా కి జరుగుతున్న బుకింగ్స్ చూసి నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమా బుకింగ్స్ కి షాక్ అవుతున్నారు. దీంతో అడ్వాన్ బుకింగ్స్ చూసి డీలా పడిపోయిన నిర్మాతలు వాయిదా మార్గం పట్టారు. ఇదే కాదు మైదాన్ కూడా ఇదే దారిలో వన్ డే పోస్ట్ పోన్ ఆలోచన చేస్తోందని సమాచారం. ఎంతసేపూ పాకిస్థాన్ తీవ్రవాదాన్ని పట్టుకుని ఒకే కథను తిప్పి తిప్పి తీస్తే ఆడియన్స్ లో ఆసక్తి ఎలా వస్తుంది. ఆల్మోస్ట్ ఇదే తీవ్ర వాదం నేపథ్యంలో ఇదే కొన్ని నెలల కిందే సల్మాన్ ఖాన్ టైగర్ 3 దెబ్బ తింది, ఆ తర్వాత వచ్చిన ఫైటర్ యావరేజ్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ అదే కాన్సెప్ట్ తో రుద్దుతున్నారు. ఇందుకే మరి బడేమియా చోటేమియా కూడా అదే దారి పడితే ఇంతకన్నా రెస్పాన్స్ ఏమొస్తుంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు