Kalki 2898 AD : “కల్కి”లో ఎన్టీఆర్ పాత్రను కొట్టేసిన అక్కినేని హీరో

Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ “కల్కి”. ఈ మూవీకి సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతోంది. ఇప్పటికే కల్కి రిలీజ్ డేట్ విషయంలో కన్ఫ్యూజన్ నెలకొనగా, తాజాగా కల్కిలో ఎన్టీఆర్ చేయాల్సిన పాత్రను అక్కినేని హీరో కొట్టేశాడు అనే వార్త చక్కర్లు కొడుతోంది. మరి ఇంతకీ ఆ అక్కినేని హీరో ఎవరు? అతనికి దక్కిన పాత్ర ఏంటి? అనే విషయంలోకి వెళ్తే…

“కల్కి”లో ఆ స్పెషల్ అక్కినేని హీరోకే…

గత ఏడాది సలార్ మూవీతో బౌన్స్ బ్యాక్ అయిన ప్రభాస్ నెక్స్ట్ మూవీ కల్కి రిలీజ్ గురించి కళ్ళల్లో వత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు అభిమానులు. భారీ అంచనాలు ఉన్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీపై హైప్ గ్రాఫ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. దీపిక పదుకొనే, దిశా పటాని ఈ మూవీలో హీరోయిన్లుగా నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, కమల్ హాసన్ లాంటి అగ్రతారలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాని మహాభారతం ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. దాని ప్రకారమే సినిమాలోని కొన్ని పాత్రల కోసం స్టార్ హీరోలను మేకర్స్ సెలెక్ట్ చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో రాబోతున్న పరశురాముడు పాత్రలో ఎన్టీఆర్ నటిస్తాడని ఇది వరకు టాక్ నడిచింది. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జున కనిపించబోతున్నాడని తెలుస్తోంది. కల్కి మూవీలో పరుశురాముడు పాత్ర చాలా కీలకమని, అందుకోసమే ముందుగా ఎన్టీఆర్ పేరును పరిశీలించిన చిత్ర బృందం ఇప్పుడు నాగార్జునను ఆ రోల్ కోసం తీసుకోవాలని భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే దాకా ఆగాల్సిందే.

మేలోనే తెరపైకి కల్కి

కల్కి మూవీని మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్టు చాలా కాలం క్రితమే చిత్ర బృందం ప్రకటించింది. దానికి తగ్గట్టుగానే శరవేగంగా షూటింగ్ పూర్తి చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే అనుకున్న సమయానికి కల్కిని థియేటర్లలోకి తీసుకురావడానికి రాత్రి పగలు తెగ కష్టపడ్డారు కల్కి టీం. కానీ ఎలక్షన్స్ మధ్యలోకి వచ్చి వీళ్ల ప్లాన్ మొత్తాన్ని చెడగొట్టేసాయి. దీంతో మే 9న రిలీజ్ కావాల్సిన కల్కి వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. కానీ మేకర్స్ నుంచి ఈ విషయమై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. మరోవైపు కల్కి మూవీ మే 30న రిలీజ్ కాబోతోందని ప్రచారం జరుగుతోంది. మరి మూవీని నిర్మిస్తున్న వైజయంతి మూవీస్ బ్యానర్ కల్కి మూవీ రిలీజ్ డేట్ పై ఎప్పుడు అధికారిక ప్రకటన వదులుతుందో చూడాలి. మరోవైపు మూవీ రిలీజ్ కంటే ముందే ఓ బిగ్ సర్ప్రైజ్ ఉండబోతోంది అని టాక్ నడుస్తోంది. ఆ సర్ప్రైజ్ గురించే ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు