Pushpa 2 Teaser: పుష్ప గాడి జాతర షురూ

ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూస్తున్న సినిమాల్లో పుష్ప 2 ఒకటి. పుష్ప సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించాడు. ఆర్య సినిమాతో తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు సుకుమార్. మొదటి సినిమాతోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక అద్భుతమైన దర్శకుడు దొరికాడు అనిపించుకున్నాడు. సినిమాను ఇలా కూడా తీయొచ్చు అని ఆర్య సినిమాతో చేసి చూపించాడు. వన్ సైడ్ లవ్ కాన్సెప్ట్ ను తీసుకొచ్చి యూత్లో మంచి క్రేజ్ ను సాధించుకున్నాడు. ఆ సినిమాతోనే అల్లు అర్జున్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయింది అని చెప్పొచ్చు.

గంగోత్రి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. అయితే ఆ సినిమా ఊహించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు. కానీ ఆర్య సినిమా మాత్రం ఊహించిన దాని కంటే కూడా ఎక్కువ విజయం సాధించింది. అల్లు అర్జున్ ఎన్ని సినిమాలు చేసినా కూడా అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో సినిమా అంటే హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇదివరకే అల్లు అర్జున్ మాట్లాడుతూ నేను ఈ స్థాయి వరకు రావడానికి కారణం ఎవరు అని వెనక్కి తిరిగి చూసుకుంటే నా వెనుక సుకుమార్ ఉన్నాడంటూ చెప్పుకొచ్చాడు. తనకు బాగా ఇష్టమైన కారు కొనుక్కొని ఆ కారు స్టీరింగ్ పైన చేయి పెట్టి నేను ఈ స్థాయికి రావడానికి కారణం ఎవరు అని ఊహించినప్పుడు నాకు మొట్టమొదటి తట్టిన పేరు సుకుమార్ అని ఒక సందర్భంలో అన్నాడు అల్లు అర్జున్.

ఇకపోతే అల్లు అర్జున్ కి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన సినిమా పుష్ప. ఈ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తగ్గేదేలే అనే డైలాగ్ ను చాలామంది పొలిటిషన్స్, స్పోర్ట్స్ మేన్స్ విరివిగా వాడటం వలన పుష్ప సినిమా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పైన కూడా అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -

ఇకపోతే నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప 2 సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ టీజర్ లో అల్లు అర్జున్ లేడి గెటప్ లో కనిపిస్తున్నారు. ఈ ఈ టీజర్ ఆడియన్స్ గూస్ బమ్స్ తెప్పిస్తుందని చెప్పొచ్చు. కేవలం వన్ మినిట్ నిడివి ఉన్న ఈ టీజర్ సినిమా పైన అంచనాలను మరింత పెంచుతుంది. అల్లు అర్జున్ మునుపెన్నడూ కనిపించిన విధంగా ఈ టీజర్ లో కనిపిస్తున్నాడు.

అల్లు అర్జున్ ఆటిట్యూడ్ స్వాగ్ తక్కువ నిడివి గల టీజర్ లో అద్భుతంగా చూపించాడు సుకుమార్. ఖచ్చితంగా ఈ సినిమా మరికొన్ని రికార్డులకు కొత్తదారి చూపిస్తుంది అనడంలో సందేహం లేదు అనే విధంగా ఉంది.రిలీజ్ చేసిన టీజర్ లో జాతరలో నుదుటిపైన కత్తితో బొట్టు పెట్టుకోవడం తరువాత కాలి వేళ్ళతో పవిట అంచును తీసి నడుముకునడుముకు బిగించి విలన్లపై విరుచుకుపడటం మంచి హై ఇస్తుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు