Suma kanakala: సుమ డాన్స్ చూశారా? స్టెప్స్ కి కడుపు చెక్కలవ్వాల్సిందే.. !

Suma kanakala:బుల్లితెర రంగంపై మకుటం లేని మహారాణిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తో పాటు క్రేజ్ ని కూడా సొంతం చేసుకున్న యాంకర్స్ లో సుమ మొదటి స్థానంలో ఉంటుంది.. గత దశాబ్ద కాలానికి పైగా తనదైన యాంకరింగ్ తో చెరగని ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఎన్నో షోలకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా సినిమా ఆడియో, ప్రీ రిలీజ్ ఈవెంట్లకి కూడా సుమ ఉండాల్సిందే.. సుమ ఈవెంట్ కి హోస్టుగా చేసిందంటే కచ్చితంగా ఆ సినిమా హిట్ అవుతుందనే ఒక సెంటిమెంటు కూడా ఉంది. అందుకే స్టార్ హీరోలను మొదలు చిన్న హీరోల వరకు ప్రతి ఒక్కరు తమ సినిమా ఈవెంట్లకు సుమ హోస్టుగా వ్యవహరించేలా చూస్తూ ఉంటారు.

ఇన్స్టా రీల్స్ తో సుమా..
ఇదిలా ఉండగా సుమ ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇన్స్టా లో సుమా చేసే కామెడీ రీల్స్ విపరీతంగా ఫేమస్ అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు తన స్టాఫ్ తో కలిసి ఈమె చేసే రీల్స్ , వేసే స్టెప్పులు అందరిని కడుపబ్బా నవ్విస్తాయనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే తాజాగా అలాంటి వీడియోనే ఒకటి పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.. తాజాగా తన స్టాప్ తో కలిసి ఒక రీల్ వీడియోని షేర్ చేయగా.. ఇది చూసిన నెటిజెన్స్ నవ్వుకుంటున్నారు..

అన్ ప్రొఫెషనల్ డాన్సర్స్ 2.0..
అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ప్రభుదేవా రీల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ రీల్ వీడియోని సుమా స్టాఫ్ రీ క్రియేట్ చేయాలని డిమాండ్ చేయడంతో.. సుమ తన టీం తో ప్రయత్నించింది.. కానీ వారంతా అన్ ప్రొఫెషనల్ డాన్సర్ కాబట్టి నాన్ సింక్లో డాన్స్ స్టెప్ చేసేసారు.. దీన్ని సుమా కూడా అన్ ప్రొఫెషనల్ డాన్సర్స్ 2.0 అంటూ ఈ వీడియోని షేర్ చేయడం జరిగింది. ఇక ఈ వీడియో చూస్తే మాత్రం నిజంగా కడుపు చెక్కలు అవ్వాల్సిందే… అంతలా ఈ రీల్ వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది .. మొత్తానికైతే నెట్టింట మరొకసారి సందడి చేసి అందరిని కడుపుబ్బా నవ్వించింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు ఈ వీడియో పైన ఉత్తేజ్ కూతురు కూడా స్పందించింది. మొత్తానికి అయితే సుమ చేసిన ఈ రీల్ వీడియో అందరిని బాగా నవ్విస్తోంది.

- Advertisement -

సుమ సినీ జీవితం..
ఒకప్పుడు దూరదర్శన్ ఛానల్ లో ప్రసారమయ్యే సీరియల్స్ లో నటించిన సుమా.. ఆ తర్వాత సినిమాలలో కూడా నటించింది.. అయితే సినిమాలలో పెద్దగా సక్సెస్ కాకపోవడంతో బుల్లితెరపై యాంకర్ గా అడుగులు వేసి.. 1994లో వచ్చిన భలే ఛాన్స్ లే షో తో యాంకర్ గా మారి తన అద్భుతమైన వాక్చాతుర్యంతో సెలబ్రిటీలను మెప్పించింది. అభిమానులను ఆకట్టుకుంది. ఇక అప్పటి నుంచీ ఇప్పటివరకు యాంకర్ గా కొనసాగుతూ ఎన్నో షోలను సంవత్సరాలు తరబడి కొనసాగించి భారీ సక్సెస్ రేట్ ను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల జయమ్మ పంచాయతీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. కానీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.. దీంతో మళ్లీ బుల్లితెరకే పరిమితమైంది. ఇక ఇప్పుడు సుమ తన కొడుకు రోషన్ కనకాలను బబుల్గం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేసింది. రోషన్ కనకాల హీరోగా వచ్చిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.. దీంతో తన కొడుకు సెకండ్ సినిమా పెద్ద హిట్ కొట్టాలని భారీ ప్రయత్నాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

 

View this post on Instagram

 

A post shared by Suma Kanakala (@kanakalasuma)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు