HBD Allu Arjun : అల్లు అర్జున్ ఫిట్నెస్ వెనకున్న సీక్రెట్ డైట్ ఇదే

HBD Allu Arjun : స్టార్ కిడ్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న స్టార్ హీరో అల్లు అర్జున్. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో గ్లోబల్ స్టార్ గా దూసుకెళ్తున్న అల్లు అర్జున్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, సెలెబ్రిటీల నుంచి బర్త్ డే విషెస్ వెలువెత్తుతున్నాయి. తన స్టైల్, అద్భుతమైన యాక్టింగ్ స్టిల్స్ తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న అల్లు అర్జున్ తాను చేసే సినిమాలకు తగ్గ విధంగా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. కొన్ని సినిమాలకు బరువు తగ్గితే, మరికొన్ని సినిమాలకు బరువు పెరిగి సినిమాపై తనకున్న ప్యాషన్ ను బయట పెడుతున్నారు. మరి గత రెండు దశాబ్దాలుగా టాలీవుడ్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్న అల్లు అర్జున్ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి? ఆయన ఎలాంటి డైట్ ఫాలో అవుతారు? అనే ఆసక్తికర విషయంలోకి వెళ్తే…

అల్లు అర్జున్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే

రెండు దశాబ్దాల నుంచి హీరోగా ఎంటర్టైన్ చేస్తున్న అల్లు అర్జున్ ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. దేశముదురు మూవీతో సిక్స్ ప్యాక్ ను టాలీవుడ్ కు పరిచయం చేసిన బన్నీ మంచి ఫిట్నెస్ తో పాటు ఫ్యాషన్ ను కూడా ఫాలో అవుతారు. అందుకే ఆయనను అభిమానులు స్టైలిష్ స్టార్ అని పిలుచుకుంటూ ఉంటారు. అయితే ఫిట్నెస్ విషయంలో ఎంతోమంది అభిమానులకు రోల్ మోడల్ గా నిలుస్తున్న ఐకాన్ స్టార్ డైట్, వ్యాయామాల విషయంలో అస్సలు రాజీపడరు. అల్లు అర్జున్ ఎలాంటి డైట్ ఫాలో అవుతారు అంటే… ప్రతిరోజూ ఉదయాన్నే నిద్ర లేచి పరగడుపున 45 నిమిషాల నుంచి గంట వరకు పరుగులు పెడతారట అల్లు అర్జున్. తన మెటపాలిజం పెరగడంలో ఇది బాగా హెల్ప్ అవుతుందని బన్నీ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ తరువాత ఎక్సర్సైజులు తప్పనిసరిగా చేస్తారు.

బన్నీకి అవంటే ఎలర్జీ…

ఇక డైట్ విషయంలోకి వెళ్తే సినిమా సినిమాకు అది మారుతుందని బన్నీ చెప్పుకొచ్చారు. లంచ్, డిన్నర్ లలో ఏమేమి తినాలి అనే విషయం తన డైట్ పై ఆధారపడి ఉంటుందని వెల్లడించారు. కానీ బ్రేక్ ఫాస్ట్ మాత్రం దాదాపుగా ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ లో ఎగ్స్ ఖచ్చితంగా ఉంటాయట. ఇక పోస్ట్ వర్కౌట్స్ ముందు ప్రోటీన్ షేక్స్, డ్రింక్స్ లాంటివి తీసుకుంటారు అల్లు అర్జున్. కానీ వారంలో రెండు సార్లు మాత్రం చీట్ డైట్ ఫాలో అవుతారట. అంటే ఆ రెండుసార్లు డైట్ ఫాలో అవ్వకుండా తనకు నచ్చింది తినేస్తూ ఉంటారు. ఇక బన్నీ డైరీ ప్రాజెక్ట్ ప్రొడక్ట్స్ కు చాలావరకు దూరంగా ఉంటారట. ఎందుకంటే అవంటే తనకు అలర్జీ అనే విషయాన్ని గతంలో జరిగిన ఇంటర్వ్యూలో బన్నీ బయట పెట్టారు.

- Advertisement -

లేజీగా అనిపిస్తే వారానికి మూడుసార్లు వర్కౌట్స్ చేస్తారట. అలాగే ఒకవేళ సినిమాకు అవసరం అనుకుంటే వారంలో ఏడు రోజులు వర్క్ అవుట్ చేయడానికి కూడా వెనకాడరు బన్నీ. ఇదన్నమాట బన్నీ ఫిట్నెస్ వెనకున్న డైట్ సీక్రెట్. ఈ డైట్ ను ఆరోగ్యంగా ఉండాలనుకునే ఎవ్వరైనా ఫాలో అవ్వచ్చు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు