HBD Allu Arjun : ఇప్పటిదాకా బన్నీ సాధించిన అరుదైన రికార్డులు ఇవే

HBD Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పాన్ ఇండియా స్టార్ గా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న బన్నీ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన తాజా చిత్రం పుష్ప 2 నుంచి టీజర్ ను రిలీజ్ చేసి అల్లు ఫాన్స్ కు ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఏప్రిల్ 8న బన్నీ బర్త్ డే సందర్భంగా ఆయన ఇప్పటిదాకా సాధించిన రికార్డులపై ఓ లుక్కేద్దాం.

1982 ఏప్రిల్ 8న జన్మించాడు అల్లు అర్జున్. అలనాటి హాస్యనటుడు అల్లు రామలింగయ్య మనవడు, గీత ఆర్ట్స్ అధినేత, స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడిగా చిన్నప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. బాల నటుడిగా రెండు మూడు సినిమాలు చేసిన బన్నీ 2002లో రిలీజ్ అయిన చిరంజీవి డాడీ సినిమాలో డ్యాన్స్ ను ఇష్టపడే టీనేజర్ పాత్రలో మెరిసి ఆకట్టుకున్నాడు. ఆయన హీరోగా మారింది మాత్రం 2003లో రిలీజ్ అయిన గంగోత్రి మూవీతో. 2004లో రిలీజ్ అయిన ఆర్య మూవీతో అటు డైరెక్టర్ సుకుమార్, ఇటు బన్నీకి బిగ్ బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత తన 20 ఏళ్ల సినీ కెరీర్లో హిట్ ప్లాఫ్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలో చేస్తూ నేడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు అల్లు అర్జున్. ఈ రెండు దశాబ్దాల సినీ కెరీర్ లో ఆయన సాధించిన అరుదైన రికార్డులు ఎన్నో.

1. అల్లు అర్జున్ కు టాలీవుడ్ తో పాటు మాలివుడ్ లో కూడా ప్రత్యేకంగా అభిమానగణము ఉంది. అక్కడ బన్నీని మల్లు అర్జున్ అనే పిలుచుకునే రేంజ్ కు అల్లు అర్జున్ క్రేజ్ ఉండడం విశేషం. మరే ఇతర టాలీవుడ్ హీరోలకు ఈ అరుదైన అవకాశం దక్కలేదు.

- Advertisement -

2. ఇంస్టాగ్రామ్ థ్రెడ్స్ యాప్ లో కేవలం ఒక్క పోస్ట్ తో వన్ మిలియన్ ఫాలోవర్స్ ను అందుకున్న ఫస్ట్ యాక్టర్ గా బన్నీ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

3. ఇంస్టాగ్రామ్ డాక్యుమెంటరీ వీడియో చేసిన ఫస్ట్ హీరో కూడా అల్లు అర్జునే.

4. దుబాయ్ లోని మేడం టుస్సాడ్స్ లో మైనపు విగ్రహం ఉన్న మొట్టమొదటి టాలీవుడ్, సౌత్ ఇండియన్ యాక్టర్ యాక్టర్ అల్లు అర్జున్.

5. న్యూయార్క్ సిటీ గ్రాండ్ మార్షల్ ఆర్ట్స్ లో పాల్గొన్న మొదటి టాలీవుడ్ హీరో కూడా బన్నీనే.

6. పాన్ ఇండియా మూవీ పుష్ప ఆడియో ఆల్బమ్ యూట్యూబ్ లో 5 బిలియన్ల వ్యూస్ దాటిన ఫస్ట్ ఇండియన్ ఆల్బమ్ గా చరిత్రను సృష్టించింది. ఇప్పటి వరకు ఆ రికార్డును ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోవడం గమనార్హం.

7. బోయపాటి బన్నీ కాంబినేషన్లో రూపొందిన సరైనోడు మూవీ యూట్యూబ్ లో 300 మిలియన్ల వ్యూస్ దాటిన మొట్ట మొదటి ఇండియన్ సినిమాగా మరో రికార్డును క్రియేట్ చేసింది.

8. పుష్ప మూవీతో అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఇలా బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్న మొట్టమొదటి తెలుగు యాక్టర్ బన్నీనే.

9. దుబాయ్ గోల్డెన్ వీసా అందుకున్న ఫస్ట్ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్. ఇలా ఇన్ని అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ఎదగడానికి మరింత కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఆయన చేస్తున్న పుష్ప 2 మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆగస్ట్ 15న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు