Sandeep Reddy Vanga about Spirit : మొదటి రోజే 150 కోట్లు వస్తుంది

Sandeep Reddy Vanga about Spirit : సందీప్ రెడ్డి వంగ ఈ పేరు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తనదైన ముద్రను వేశాడు. సినిమాని ఇలా కూడా తీయొచ్చు అంటూ సినిమాకి ఒక కొత్త ఫార్ములాను చూపించాడు సందీప్ రెడ్డివంగా. ఎన్ని సినిమాలు వచ్చినా కూడా కొన్ని సినిమాలు ఇంపాక్ట్ అనేది కొన్ని ఏళ్ల పాటు అలాగే ఉండిపోతుందని చెప్పొచ్చు. రాంగోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయమైన శివ సినిమా అలాంటిది. శివ సినిమా వచ్చిన తర్వాత చాలామంది విజయవాడలో సైకిల్ చైన్ పట్టుకుని తిరిగేవారు అంటూ చెబుతూ ఉంటారు. అంటే ఆ సినిమా చూపించిన ఇంపాక్ట్ అలాంటిది.

ఇకపోతే అర్జున్ రెడ్డి సినిమా కూడా శివ తో కంపేర్ చేసేంత హిట్ అయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక సంచలమైన దర్శకుడు దొరికాడు అని అనిపించుకున్నాడు సందీప్ రెడ్డి. ఇదే సినిమాని బాలీవుడ్ లో సాహిద్ కపూర్ తో కబీర్ సింగ్ గా తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాకి బాలీవుడ్ లో చాలా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. రేటింగ్స్ కూడా చాలా తక్కువగా వచ్చాయి. కానీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాకి 250 కోట్లకు పైగా వసూళ్లను అందించారు. ఈ సినిమా పై కొందరు కావాలని విష ప్రచారం చేశారంటూ రియలైజ్ అయ్యాడు సందీప్ రెడ్డి. ఈ సినిమాను ఒక వైలెంట్ ఫిలిం గా చెప్పుకొచ్చారంటూ చాలా ఫీల్ అయ్యాడు.

అయితే బాలీవుడ్ పీపుల్ కి అసలు వైలెంట్ ఫిలిం అంటే ఏంటో చూపిస్తాను అంటూ రణ్బీర్ కపూర్ హీరోగా అనిమల్ సినిమాను తెరకెక్కించాడు. అనిమల్ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దాదాపు 1000 కోట్లకు పైగా ఈ సినిమా వసూలు చేసింది. సినిమా మొదటి షో పడినప్పుడు నుంచి మంచి పాజిటివ్ టాక్ తో అద్భుతంగా దూసుకెళ్లింది. మూడు గంటల పైగా నిడివి ఉన్న ఈ సినిమా ప్రేక్షకులకు అంతగా ఎక్కడానికి కొంతమంది భావించారు. అయితే సందీప్ మాత్రం డ్యూరేషన్ అనేది పెద్ద మేటర్ కాదని సినిమాను రిలీజ్ చేశాడు. సందీప్ నమ్మకమే నిజమైంది. ఇకపోతే సందీప్ రెడ్డి వంగ రీసెంట్ టైమ్స్ లో మంచి హాట్ టాపిక్ అయ్యాడు.

- Advertisement -

హీరో విశ్వక్సేను కూడా సినిమాలో నటించకుండానే హీరో అయ్యావు అంటూ సందీప్ గురించి చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి స్పిరిట్ అని టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా కంటే ముందు ఒక హాలీవుడ్ సినిమాను రీమేక్ చేద్దాం అని ప్రభాస్ చెప్పారట. అయితే దానికి సందీప్ ఒప్పుకోకుండా ఒక ఒరిజినల్ థాట్ తో ముందుకు వచ్చాడు అదే స్పిరిట్. ఈ సినిమాకి సంబంధించి 60 శాతం వరకు రైటింగ్ సందీప్ రెడ్డివంగా పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఈ సినిమాను డిసెంబర్ లో షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు సందీప్ ఇదివరకే తెలిపాడు.

ఈ సినిమాకు దాదాపు 300 కోట్లు బడ్జెట్ పెట్టబోతున్నారు. అయితే రీసెంట్ గా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి చెప్పుకొచ్చాడు సందీప్. 300 కోట్ల బడ్జెట్ ప్రభాస్ కు పెట్టడం వర్త్ అని, ప్రొడ్యూసర్ ఖచ్చితంగా సేఫ్ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రభాస్ అన్న నా కాంబినేషన్లో సినిమా అంటే శాటిలైట్ రైట్స్ బాగా వస్తాయి.ఫస్ట్ డే కలెక్షన్స్ 150 కోట్లు ఈజీగా వస్తుందంటూ చెప్పాడు. దీనిని ఇంకా క్లారిటీగా వివరిస్తూ ప్రస్తుతం ట్రేడ్ ప్రకారం మొదటి రోజు 15 కోట్లు వస్తుంది అంటూ సందీప్ వివరణ ఇచ్చాడు. ఇకపోతే ఈ సినిమా రైటింగ్ ప్రాసెస్ ఇంకా ఫినిష్ కావలసి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు