Kung Fu Panda 4 : పిల్లల సినిమాకి మూడు వేల కోట్లా!

Kung Fu Panda 4 : హాలీవుడ్ లో ఈ ఇయర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన సినిమాలు అంతగా గొప్పగా పెర్ఫార్మ్ చేయడం లేదని చెప్పాలి. లాస్ట్ ఇయర్ భారీ చిత్రాలతో బ్లాక్ బస్టర్ కలెక్షన్లతో కళకళలాడిన హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఈ ఇయర్ పెద్ద సినిమాల సందడి ఇంకా లేక సోసో గా నెట్టుకువస్తుంది. అప్పట్లోలాగా మార్వెల్ మూవీస్ కూడా రెగ్యులర్ గా రావడం లేదు. అయితే తక్కువ బజ్ తో రిలీజ్ అయిన కొన్ని సినిమాలు మాత్రం భారీ కలెక్షన్లు సాధించాయి. ఈ ఇయర్ రిలీజ్ అయిన సినిమాల్లో డూన్ పార్ట్ 2, గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కాంగ్ సీక్వెల్, అలాగేబాబ్ మార్లే, ఘోస్ట్ బస్టర్స్ సినిమాలు భారీ కలెక్షన్లను సాధించాయి. అయితే హాలీవుడ్ లో ఈ ఇయర్ వచ్చిన సినిమాల్లో కొంచెం లెస్ బజ్ ను సొంతం చేసుకుని రిలీజ్ అయిన మూవీ ‘కుంగ్ ఫూ పాండ4’ (Kung Fu Panda 4). అయితే పెద్దగా అంచనాలు లేని ఈ సినిమా రిలీజ్ అయ్యాక కూడా క్రిటిక్స్ నుండి రివ్యూలు యావరేజ్ గా రాగా చిన్న పిల్లలు చూడటానికి ఎక్కువగా ఇష్టపడతారు అంటూ టాక్ అయితే వచ్చింది. కానీ అనూహ్యంగా ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లను చూసి ట్రేడ్ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

ఇండియా లోనూ భీభత్సం..

ఇక హాలీవుడ్ లో చిన్న పిల్లల సినిమాగా ఎంటర్టైన్మెంట్ జోనర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్ టాక్ తోనే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించింది. నెమ్మదిగా స్టార్ట్ అయిన ఈ సినిమా నెల రోజులు పూర్తి అయ్యే టైంకి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక కుంగ్ ఫు పాండా 4 ఇండియా లో కూడా మొత్తం మీద నెల రోజుల్లో సినిమా 35 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని అదుర్స్ అనిపించింది. అయితే ఇండియా లో కూడా మలయాళంలో మినహా పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు ఇతర ఇండస్ట్రీలలో రాకపోవడం వల్ల ఇది సాధ్యమైందని చెప్పొచ్చు. ఇక కుంగ్ ఫు పాండ 4 ఓవర్సీస్ లో హాలీవుడ్ ప్రేక్షకుల్ని, పిల్లల్ని బాగా అలరించింది. ఇక సినిమా అమెరికాలో మొత్తం మీద నెల రోజుల్లో $166.1M డాలర్స్ ను సొంతం చేసుకోగా ఇండియన్ కరెన్సీలో మొత్తం మీద 1,378 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. టోటల్ ఓవర్సీస్ లో సినిమా $244.4M మిలియన్ డాలర్స్ ను సొంతం చేసుకుంది…ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే 2,028 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది.

అక్షరాలా మూడున్నర వేల కోట్లు..

అయితే కుంగ్ ఫు పాండ 4 రిలీజ్ అయిన నెల రోజుల్లో మొత్తం మీద వరల్డ్ వైడ్ గా సినిమా $410.5M మిలియన్ డాలర్స్ మార్క్ ని సొంతం చేసుకోగా, ఇండియన్ కరెన్సీలో సినిమా ఓవరాల్ గా 3,407 వేల కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. కేవలం చిన్న పిల్లల సినిమానే అనుకున్నా కూడా ఈ రేంజ్ లో జోరు చూపించి ఇప్పటికీ స్టడీగా కలెక్షన్స్ ను సాధిస్తూ సినిమా హాల్ఫ్ హండ్రెడ్ మిలియన్ మార్క్ వైపు దూసుకు పోతుంది. అప్పట్లో ది జంగల్ బుక్, ది లయన్ కింగ్ సినిమాలు కూడా చిన్న పిల్లల సినిమాగానే టాక్ తెచ్చుకుని భారీ కలెక్షన్లు సాధించాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు