Payal Rajput : సైలెంట్ అయిన పాయల్.. కారణం..!!

Payal Rajput UpComing Movies : పంజాబీ ప్రాంతం నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. Rx -100 చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా కుర్రకారు ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయింది. ఆ తర్వాత ఎన్నో అవకాశాలు అందుకున్నప్పటికీ ఏ ఒక్కటి కూడా ఈమె కెరియర్ కు ఉపయోగపడలేదు.. ఎక్కువగా ఈమెకు బోల్డ్ క్యారెక్టర్ లోనే నటించేందుకు అవకాశాలు రావడంతో చివరికి పాయల్ కు విసుగు వచ్చే అలాంటి పాత్రలు చేయనని తెగేసి చెప్పేసింది.

సక్సెస్ అయినా అందని అవకాశం..

మళ్లీ కొన్ని సంవత్సరాలకు ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మంగళవారం సినిమాలో నటించి మరొకసారి అందరికీ గుర్తుండిపోయే నటనతో మెప్పించింది పాయల్.. ఈ సినిమా తర్వాత ఒక్కసారిగా ఈమె కెరియర్ మలుపు తిరుగుతుంది అనుకోగా ఎందుకో అవకాశాలు మాత్రం వెలువడడం లేదు.. ప్రస్తుతం పాయల్ చేతిలో తమిళ చిత్రాలు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే తెలుగులో కేవలం కిరాతక అనే ఒక సినిమాలో మాత్రమే నటిస్తున్నట్లు తెలుస్తోంది.. యంగ్ హీరోయిన్స్ అందరూ కూడా వరుసగా సినిమాలతో దూసుకుపోతూ ఉంటే.. పాయల్ మాత్రం అవకాశాలు రాక సైలెంట్ అయిపోయింది.

కాంతారా 2 లో పాయల్..

పాయల్ తనకు ఉన్న గ్లామర్ ఇమేజ్ ను సరిగ్గా వాడుకుంటే ఎన్నో అద్భుతమైన విజయాలను కూడా అందుకోవచ్చు.. కానీ..RX -100 వంటి కథలే వస్తూ ఉండడంతో ఈమె ఈ కథలను రిజెక్ట్ చేస్తోంది.. తనకు ఏవైనా సరే చాలెంజింగ్ రోల్స్ వస్తే కచ్చితంగా చేస్తానని అలాంటి పాత్రలకు తను న్యాయం చేయగలనని కూడా ఎన్నోసార్లు తెలియజేసింది. కేవలం తనలో గ్లామర్ హీరోయిన్ గానే కాకుండా నటిని కూడా చూడాలని తెలియజేస్తోంది. గతంలో కూడా కాంతార ప్రీక్వెల్ లో తనకి అవకాశం ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా హీరో డైరెక్టర్ రిషబ్ శెట్టి నీ అడగడం జరిగింది.

- Advertisement -
Payal Rajput in Kantara 2
Payal Rajput in Kantara 2

అలా అయితే కనుమరుగవ్వాల్సిందే..

మంగళవారం సినిమాతో పాయల్ మరొకసారి తన సత్తా చాటగా.. రాబోయే సినిమాలలో కూడా తనని తాను ప్రూప్ చేసుకునే విధంగా కథలను ఎంచుకుంటోంది. తనకు కథ నచ్చితే ఎలాంటి హీరోలతో అయినా సరే నటించడానికి సిద్ధమే అంటుంది పాయల్ రాజ్ పుత్.. అయితే సినిమా అవకాశాలు లేని సమయంలో నిరంతరం సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలతో కుర్రకారులకు కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. పాయల్ అభిమానులు కూడా తిరిగి మళ్లీ ఆమెకు అవకాశాలు రావాలని కోరుకుంటున్నారు. ఇకనైనా పాయల్ కి అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.. వాస్తవానికి పాయల్ కు ఈ మధ్యకాలంలో అసలు కలిసి రావడం లేదనే చెప్పాలి..ఒక సినిమా సక్సెస్ అయితే మిగతా వారందరికీ వరుసగా అవకాశాలు వస్తాయి కానీ పాయల్ కి మాత్రం అవకాశాలు ఆమడ దూరంలోనే ఉంటున్నాయి.. ఆర్ఎక్స్ 100 తర్వాత అవకాశాలు కోల్పోయింది.. ఇప్పుడు మంగళవారం సినిమా తర్వాత కూడా అవకాశాలు లభించడం లేదు. ఇలా అయితే మరికొన్ని రోజుల్లో ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు