Niharika Insta Post : తోడు దొరికిందా? ఆ పోస్ట్ కి అర్థం..?

Niharika Insta Post : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా డాటర్ నిహారిక ఒకవైపు నటిగా , మరొకవైపు యాంకర్ గా, ఇప్పుడు నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టి దూసుకుపోతున్న విషయం తెలిసిందే.. సినిమాలలో అవకాశాలు తగ్గినప్పుడు కుటుంబ సభ్యుల మేరకు వివాహం చేసుకున్న ఈమె అటు భర్తతో కూడా ఎక్కువ కాలం కొనసాగలేక విడాకులు తీసుకొని ఆశ్చర్యపరిచింది . విడాకులు తీసుకున్న సమయంలో ఎన్నో ట్రోల్స్, విమర్శలు కూడా ఎదుర్కొన్న ఈమె ఆ తర్వాత సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఏదో ఒక విషయాన్ని షేర్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అంతేకాదు తనకు సంబంధించిన ప్రతి ఫోటోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడమే కాదు గ్లామర్ ఫోటోలతో కూడా యువతను అట్టుడికిస్తోంది. ఇక మరో వైపు హీరోయిన్గా రియంట్రీ ఇవ్వడంతో పాటు యాంకర్ గా కూడా ఇప్పుడు ఒక షో చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

నిహారిక మళ్లీ ప్రేమలో పడిందా..

విడాకుల తర్వాత పింక్ ఎలిఫెంట్ అనే బ్యానర్ ను స్థాపించి సినిమాలు, వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోని తనపై ట్రోల్స్ వస్తున్నా పట్టించుకోకుండా తనకు నచ్చింది చేస్తూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది.. అంతేకాదు గ్యాప్ దొరికినప్పుడల్లా తన ఫ్రెండ్స్, ఫ్యామిలీకి టైం కేటాయిస్తూనే కెరియర్ ను ఫుల్ ఫామ్ లోకి తెచ్చుకుంది ఈ మెగా డాటర్. ఇదిలా ఉండగా తాజాగా నిహారిక పెట్టిన పోస్టు నెట్టింట చర్చకు దారి తీసింది. అందులో రెండు ఏనుగులు ముఖాన్ని దగ్గరగా పెట్టుకుని.. ఓ కపుల్ లవ్ లో ఉంటే ఎలా ప్రేమగా ఉంటారో అలా కనిపించాయి. ఇక ఈ ఫోటో షేర్ చేసిన నిహారిక తమ ప్రేమకు గుర్తుగా రెడ్ హార్ట్ కూడా షేర్ చేసింది. ఇక ప్రస్తుతం మెగా డాటర్ పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట చాలా వైరల్ అవుతుండగా ఇది చూసిన వారంతా నిహారిక మళ్ళీ ప్రేమలో పడిందేమో.. అందుకే ఇలాంటి హింట్ ఇచ్చింది అంటూ కామెంట్లు చేస్తున్నారు..

పోస్ట్ అర్థం ఏమిటో..

అయితే మెగా అభిమానులు మాత్రం ఈ వార్తలను కొట్టి పడేస్తున్నారు. నిహారిక పై వస్తున్న ఈ వార్తలలో నిజం లేదని.. ఏనుగులు అంటే తనకు చాలా ఇష్టం కావచ్చు.. అందుకే ఇలా ఫోటో పెట్టింది లేదా ఆ ఫోటో చాలా బాగుందని షేర్ చేసిందేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు.. వాస్తవానికి మేరీనా కెనో అనే వైల్డ్ ఫోటోగ్రాఫర్ క్యాప్చర్ చేసిన ఈ ఫోటోని నిహారిక షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. మొత్తానికి అయితే నిహారిక ఏ ఉద్దేశంతో ఈ ఫోటో షేర్ చేసిందో తెలియదు కానీ చూడడానికి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పవచ్చు. ఇక నిహారిక విషయానికి వస్తే ప్రస్తుతం నిర్మాతగా హీరోయిన్గా యాంకర్ గా బాధితులు చేపట్టింది మ రి ఏ రంగంలో ఆమె సక్సెస్ అవుతుందో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.. మరొకవైపు మళ్లీ పెళ్లికి సిద్ధమవుతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి మరి దీనిపై కూడా నిహారిక ఏ విధంగా క్లారిటీ ఇవ్వకుండా చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Niharika Konidela (@niharikakonidela)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు