Renu Desai Emotional Video : కొడుకు పై రేణూ దేశాయ్ ఎమోషనల్… వీడియో వైరల్..!

Renu Desai Emotional Video : ప్రముఖ సినీ నటుడు, రాజకీయవేత్త పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ప్రస్తుతం తన భర్త నుంచి దూరంగా ఉంటూ తన ఇద్దరు పిల్లల బాధ్యతలను నిర్వహిస్తూ ఒంటరిగా ముంబైలో గడుపుతున్న జీవితాన్ని గడుపుతున్న విషయం తెలిసిందే.. సమాజంలో జరిగే విషయాలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది రేణూ దేశాయ్. ఈ క్రమంలోనే ఏప్రిల్ 8వ తేదీన తన కొడుకు అకిరా నందన్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తన కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ఎమోషనల్ వీడియోని అభిమానులతో పంచుకుంది రేణూ దేశాయ్.

రేణూ ఎమోషనల్..

సాధారణంగా ప్రతి ఏడాది కూడా అకీరా పుట్టినరోజు సందర్భంగా.. అకీరా ఫోటోలను , వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయాలంటూ అభిమానులు ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు.. కాకపోతే ఇలాంటివి షేర్ చేయడం అకీరా నందన్ కు ఇష్టం ఉండదట. కాబట్టి ఈమె కూడా పెద్దగా తన కొడుకు ఫోటోలను షేర్ చేయదు.. కానీ ఈ ఏడాది కొడుకు పుట్టినరోజు సందర్భంగా అకిరా తన కడుపులో ఉన్నప్పటి వీడియోని షేర్ చేస్తూ ఈమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అకీరా 8 నెలల గర్భంలో ఉన్నప్పటి వీడియోని షేర్ చేస్తూ ఆ క్షణాలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ..

నన్ను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు..

ఆ సమయంలో నేను ఎనిమిది నెలల గర్భంతో ఉన్నాను.. కడుపులో అకిరా ఉన్నాడు.. నన్ను తల్లిగా ఎంచుకున్నందుకు ధన్యవాదాలు అంటూ తన బిడ్డ 20వ ప్రాయంలోకి వచ్చేసాడని తెలిపారు రేణూ దేశాయ్. ఈ విధంగా తన బిడ్డ పొట్టలో ఉన్న క్షణాలను గుర్తుచేసుకొని పోస్ట్ చేయడంతో ఇప్పటి ఫోటోలను షేర్ చేయండి అంటూ అభిమానులు కోరుతున్నారు. ఇకపోతే అకీరా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టక ముందే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే.అయితే దీనికి కారణం ఒక రకంగా తన తండ్రి పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ , రేణూ దేశాయ్ విడిపోయిన సరే పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ కొడుకును ఎప్పటికప్పుడు అభిమానిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోని అకిరా ఇండస్ట్రీలోకి రావాలని కోరుకునే వారిలో పవన్ అభిమానులు మొదటి స్థానంలో ఉంటారనటంలో సందేహం లేదు.

- Advertisement -

అకీరా నందన్ టాలెంట్..

అకీరా తన తండ్రి లేదా తల్లి పాపులారిటీని ఉపయోగించుకోకుండా సొంతంగా ఇండస్ట్రీలో ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే నటుడిగా ఎదగడం కంటే ముందు మంచి పాపులారిటీ దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే తాను ఒక మంచి పియానో ప్లేయర్ అని అందరికీ తెలిసిందే .ఇక ఆ పియానో ద్వారా పలు రకాల పాటలను ప్లే చేస్తూ అద్భుతంగా పేరు దక్కించుకున్నారు ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో తన తల్లి కూడా ఈయనను బాగా పాపులర్ చేసిందని చెప్పవచ్చు మొత్తానికైతే అకిరా నందన్ ఇండస్ట్రీ లోకి రాకముందే క్రేజ్ దక్కించుకున్న నేపథ్యంలో హీరోగా అడుగుపెడితే ఎలా సక్సెస్ అవుతారో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు