Agent OTT : ఏజెంట్ ఓటిటి స్ట్రీమింగ్ కు మోక్షమెప్పుడో చెప్పేసిన నిర్మాత

Agent OTT : అక్కినేని అఖిల్ హీరోగా నటించిన గత చిత్రం ఏజెంట్ ఇప్పటిదాకా ఓటిటి స్ట్రీమింగ్ కు నోచుకోలేదన్న విషయం తెలిసిందే. మరి ఈ మూవీకి మోక్షం ఎప్పుడు అన్న ప్రశ్నకు స్పందించిన నిర్మాత అనిల్ సుంకర తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏజెంట్ ఓటీటీలోకి ఎప్పుడు రాబోతోంది? నిర్మాత అనిల్ సుంకర ఏజెంట్ గురించి ఏం చెప్పారు? అనే వివరాల్లోకి వెళితే…

చాలాసార్లు చెప్పాను – అనిల్ సుంకర

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన మూవీ ఏజెంట్. సాక్షి వైద్య ఈ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వగా, మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. డినో మారియా విలన్ గా నటించారు. ఈ స్పై థ్రిల్లర్ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఏజెంట్ గత ఏడాది ఏప్రిల్ 28న థియేటర్లలోకి వచ్చాడు. కానీ ఈ మూవీ అంచనాలను అందుకోకపోగా, కేవలం 8 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టి అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయింది. నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చిన ఏజెంట్ మూవీని తెలుగుతో పాటు మలయాళంలో కూడా రిలీజ్ చేశారు. కానీ అక్కడ కూడా ఈ మూవీ పెద్దగా ఆడలేదు.

ఏజెంట్ రిలీజ్ అయ్యి దాదాపు ఏడాది కావస్తోంది. కానీ ఇప్పటి వరకు ఏజెంట్ ఓటీటీకి మోక్షం దక్కలేదు. పలు వివాదాల కారణంగా ఇప్పటి వరకు ఓటీటీలోకి రాలేకపోయినా ఏజెంట్ గురించి తాజాగా ప్రొడ్యూసర్ అనిల్ సుంకర స్పందించారు. సోషల్ మీడియా వేదికగా హీరో అఖిల్ అక్కినేనితో పాటు ప్రొడ్యూసర్ అనిల్ సుంకరను ట్యాగ్ చేస్తూ ఏజెంట్ ను ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని ప్రశ్నించాడు ఓ నెటిజన్. ఆ ప్రశ్నకు స్పందించిన అనిల్ సుంకర ఏజెంట్ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ను సోనీ లివ్ కు అమ్మినట్టు చాలా సార్లే చెప్పానని గుర్తు చేశారు. అతి త్వరలోనే ఏజెంట్ మూవీ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని రిప్లై ఇచ్చారు ఈ ప్రొడ్యూసర్. కానీ ఆయన ఇంకా ఎగ్జాక్ట్ డేట్ ను కన్ఫర్మ్ చేయకపోవడం గమనార్హం.

- Advertisement -

వివాదాల కారణంగానే వాయిదా…

స్పై మూవీ ఏజెంట్ స్ట్రీమింగ్ రైట్స్ ను సోనీ లివ్ కొనుగోలు చేసింది. అందులో భాగంగానే ఏజెంట్ ను తమ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేయడానికి సోనీ లివ్ ఇప్పటికే పలుమార్లు ప్రయత్నించింది. కానీ ఈ మూవీ విషయంలో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య ఉన్న కోర్టు గొడవల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అలాగే రీ ఎడిటింగ్ సమస్యలు కూడా దీనికి తోడయ్యాయి. ఇక చివరకు ఏజెంట్ మూవీ ఓటిటి రిలీజ్ పై అక్కినేని అభిమానులు పూర్తిగా ఆశలు వదిలేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి ప్రొడ్యూసర్ అనిల్ సుంకర స్పందిస్తూ త్వరలోనే ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ కాబోతోందని వెల్లడించారు. ఈ మూవీకి మరో ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ సురేందర్ రెడ్డి వ్యవహరించడం గమనార్హం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు