Prabhas – Hanu Raghavapudi Movie : ప్రభాస్, హను రాఘవపూడి మూవీ టైటిల్ ఇదే?

Prabhas – Hanu Raghavapudi Movie : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నెక్స్ట్ మూవీ డైరెక్టర్ హను రాఘవపూడితో చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా డైరెక్టర్ హను ఈ ప్రాజెక్టు ను అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో రెబల్ స్టార్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇక ఈ మూవీకి సంబంధించి రోజుకో వార్త ఇప్పటి నుంచే వైరల్ అవుతుంది. తాజాగా ప్రభాస్, హను రాఘవపూడి మూవీ టైటిల్ ఇదే అంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. మరి ఇంతకీ ఈ క్రేజీ ప్రాజెక్టు టైటిల్ ఏంటి? అనే ఇంట్రెస్టింగ్ విషయంలోకి వెళ్తే…

ప్రభాస్ – హను రాఘవపూడి మూవీ టైటిల్…

ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీ షెడ్యూల్ లో ఉన్నారు. ఒకవైపు కల్కి 2898 ఏడి, మరోవైపు రాజా సాబ్ సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. వీటితో పాటే సలార్ పార్ట్ 2ను కూడా చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ నెక్స్ట్ మూవీపై అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు డైరెక్టర్ హను రాఘవపూడి. చాలాకాలం నుంచి ప్రభాస్ హీరోగా సీతారామం ఫేమ్ హను రాఘవపూడి డైరెక్టర్ గా ఒక క్రేజీ లవ్ స్టోరీ పట్టాలెక్కబోతోందని వార్తలు వస్తున్నాయి. తాజాగా డైరెక్టర్ హను రాఘవపూడి తాను నెక్స్ట్ ప్రభాస్ తోనే సినిమా చేయబోతున్నానని వెల్లడించారు. వరంగల్ లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా డైరెక్టర్ హను రాఘవపూడి హాజరయ్యారు. ఈ ఈవెంట్ లోనే ప్రభాస్ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. ఇదొక పీరియాడికల్ యాక్షన్ డ్రామా అని, ఓ చారిత్రాత్మక సంఘటనతో ముడిపడిన కథ అని చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన మూడు పాటల కంపోసింగ్ పూర్తయిందని చెప్పి షాక్ ఇచ్చారు హను.

ఇక ఈ హిస్టారికల్ లవ్ స్టోరీ కి ఫౌజీ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఫౌజీ అంటే సైనికుడు అనే అర్థం వస్తుంది. సీతారామం తరహాలోనే ప్రభాస్, హను రాఘవపూడి మూవీ కూడా ఇండియన్ ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో కొనసాగుతుందనే వార్తల నేపథ్యంలో, ఈ టైటిల్ పర్ఫెక్ట్ గా ఉంటుందని అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ మూవీలో రెబల్ స్టార్ ఆర్మీ సోల్జర్ గా కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ప్రభాస్ కు జోడిగా కనిపించబోతుందని తెలుస్తోంది. సీతారామం హీరో దుల్కర్ సల్మాన్ గెస్ట్ రోల్ చేయబోతున్నాడని టాక్ నడుస్తోంది. అయితే నటీనటులపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.

- Advertisement -

ఆ నాలుగు సినిమాల తర్వాతేనా?

ప్రభాస్ హను రాఘవపూడి ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలేకపోతోంది? అంటే ప్రస్తుతం ప్రభాస్ కమిట్మెంట్స్ దృష్ట్యా దాదాపు మూడు నాలుగు సినిమాలను ఆయన పూర్తి చేసేదాకా హను వెయిట్ చేయక తప్పదు. ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 ఏడి మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. మే 9న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ 30న రాబోతోందని ప్రచారం సాగుతోంది. మరోవైపు ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ మూవీని పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2ను, అనంతరం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ ను పట్టాలెక్కించాల్సి ఉంది. ఆ తర్వాతే హను రాఘవపూడి వంతు వస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు