Harish Shankar: తమ్ముడి డైరెక్టర్ తో అన్నయ్య మూవీ వర్కౌట్ అయ్యేనా..?

డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమా చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మళ్లీ ఆయనతో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నారు.. అయితే ఇప్పుడు ఈ సినిమాని పక్కన పెట్టి త్వరలోనే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. జనసేనాని పొలిటికల్ వర్క్స్ కారణంగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ సినిమాని కాస్త పక్కకు పెట్టిన హరీష్ శంకర్.. ఇప్పుడు రవితేజ తో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది.. అలాగే మెగాస్టార్ చిరంజీవితో కూడా సినిమా చేస్తారని సమాచారం.. వారం రోజులపాటు దీనిపై కూర్చొని ఫైనల్ స్టోరీని ఓకే చేసినట్టు కూడా తెలుస్తోంది.. కథ ఓకే అయితే ఈ ప్రాజెక్టుని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారట..

రవితేజ తో మిస్టర్ బచ్చన్..
మరొకవైపు మాస్ మహారాజా రవితేజ ఇటీవల ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.. ఇప్పుడు హరీష్ శంకర్ తో మిస్టర్ బచ్చన్ సినిమాను మరో రెండు నెలలు పట్టాలెక్కించబోతున్నారు.. ఈ సినిమా పూర్తయిన వెంటనే హరీష్ శంకర్ చిరంజీవితో సినిమా చేయనున్నట్లు సమాచారం..

చిరుతో మూవీ..
ముందుగా మెగాస్టార్ తన కూతురు సుస్మిత కొణిదెల హోమ్ బ్యానర్ లో సినిమా చేద్దామని అనుకున్నారు.. ఆ తర్వాత ఆ సినిమాను పక్కనపెట్టి యూవి క్రియేషన్స్ విశ్వంభర సినిమాని పట్టాలెక్కించారు. ఇప్పుడు తన పెద్ద కుమార్తెతో హరీష్ శంకర్ సినిమాను తెరకెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి.. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడు లేదు కానీ చిరంజీవితో సినిమా చేస్తారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి.. ఇకపోతే వరుసగా యంగ్ డైరెక్టర్లకి అవకాశాలు ఇస్తున్న చిరంజీవి.. తన జాబితాలో హరీష్ శంకర్ ని కూడా చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి..

- Advertisement -

పవన్ ని పక్కన పెట్టినట్టేనా..
ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున జోరుగా ప్రచారం మొదలుపెట్టిన విషయం తెలిసిందే.. మరో రెండు మూడు రోజుల్లో ఎన్నికల కోడ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రాజకీయాలపై పూర్తి ఫోకస్ చేసిన పవన్ కళ్యాణ్ తాను ప్రకటించిన సినిమాలన్నింటిని ఎలక్షన్ పూర్తయ్యే వరకు వాయిదా వేసినట్లు సమాచారం.. ఈ నేపథ్యంలోనే ఈయనతో సినిమా చేయాల్సిన డైరెక్టర్లు కూడా ఇతర హీరోలను వెతుక్కుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చిరంజీవితో సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక ఇది విన్న నెటిజన్ లు ట్రోల్ చేస్తున్నారు.. తమ్ముడిని పక్కకు పెట్టి అన్నయ్య చెంతకు చేరిన హరీష్ శంకర్.. ఇప్పుడైనా సినిమా పూర్తి చేస్తారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. మరి దీనిపై పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు