Trivikram : తెలుగు స్టార్ హీరోలు ఖాళీగా లేరు

స్వయంవరం సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి రచయితగా ఎంట్రీ ఇచ్చాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆ సినిమాతోనే అద్భుతమైన పేరును రచయితగా సంపాదించుకున్నాడు. ఆ తర్వాత చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి వంటి సినిమాలు త్రివిక్రమ్ కి రైటర్ గా మంచి పేరును తీసుకొచ్చి పెట్టాయి. అయితే 2002లో నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడుగా మారాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. తరుణ్, శ్రీయ జంటగా నటించిన ఆ సినిమా కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించింది.

ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా 2005లో అతడు అనే సినిమాను తెరకెక్కించాడు త్రివిక్రమ్. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు కానీ ఇప్పటికీ టీవీలో వస్తున్న ప్రతిసారి అద్భుతమైన టిఆర్పి రేటింగ్ నమోదు చేసుకుంటుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన జల్సా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కెరియర్ కి అదొక కం బ్యాక్ ఫిల్మ్ లా అనిపించింది. ఆ తర్వాత చేసిన ఖలేజా సినిమా థియేటర్ వద్ద అంతంత మాత్రమే ఆడింది.

ఆ తర్వాత 2012లో జులాయి అనే సినిమాను తెరకెక్కించారు త్రివిక్రమ్. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అవడంతో పాటు మంచి ప్రశంసలను కూడా అందుకుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో చేసిన అత్తారింటికి దారేది ఆల్ టైం రికార్డ్. అప్పటివరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అన్ని సినిమాల రికార్డును ఆ సినిమా తిరగరాసింది అని చెప్పొచ్చు. ఆ తర్వాత మళ్లీ అల్లు అర్జున్ తో సన్నాఫ్ సత్యమూర్తి అనే సినిమాను తెరకెక్కించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

- Advertisement -

అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరియర్ లో చాలా ఎక్కువ శాతం సినిమాలు స్టార్ హీరోస్ తోనే చేశాడు. ఇక నితిన్ తో తీసిన అ ఆ సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే త్రివిక్రమ్ కెరియర్ లో ఇప్పటికీ ఎప్పటికీ మిగిలిపోయే డిజాస్టర్ అంటే అజ్ఞాతవాసి అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ నటించిన 25వ సినిమా కావటంతో ఈ సినిమా పైన మంచి అంచనాలు ఉండేవి. కానీ ఆ అంచనాలన్నీ తారుమారు అయిపోయాయి. అంతటి డిజాస్టర్ ను చవి చూసింది అజ్ఞాతవాసి సినిమా.

ఆ తర్వాత చేసిన అరవింద సమేత వీర రాఘవ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలవైకుంఠపురం లో సినిమా అయితే నాన్ బాహుబలి రికార్డ్స్ ను కొట్టి పెట్టింది. ఇకపోతే రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో కూడా మంచి సక్సెస్ అందుకున్నాడు. త్రివిక్రమ్ కెరియర్ లో నితిన్, తరుణ్ మినహాయిస్తే మిగతా అన్ని సినిమాలు కూడా స్టార్ హీరోస్ తోనే చేశారు త్రివిక్రమ్.

అయితే ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోస్ ఎవరు ఖాళీగా లేరు. అందుకోసమని ఇప్పుడు తమిళ్లో స్టార్ హీరో అయిన విజయ్ తో త్రివిక్రమ్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదివరకే విజయ్ తో తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా సినిమా చేశాడు. విజయ్ కి తమిళ్లో ఉన్న స్టార్డం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పోతే ఇంకో తెలుగు స్టార్ హీరో గురించి త్రివిక్రమ్ వెయిట్ చేస్తాడా.? లేకపోతే విజయ్ తో ముందుకు వెళ్తాడా.? అనే తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయడం తప్పదు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు