Vijay Thalapathy: ఇది మరీ దారుణం… సుడిగాలి సుధీర్‌ని కాపీ కొట్టడం ఏంటి?

Vijay Thalapathy:  విజయ్ ధళపతి, వెంకట్ ప్రభు కాంబినేషన్ లో దళపతి 68 వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ టైటిల్ GOAT (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) గా ఫిక్స్ చేసి, అనౌన్స్ చేశారు. అంతే కాదు… ఈ సినిమాలో విజయ్ దళపతి డ్యూయల్ రోల్ చేస్తున్నాడని చెప్పేశారు. ఇంకా చెప్పాలంటే.. ఆ రెండు పాత్రల లుక్స్ ను కూడా రిలీజ్ చేశారు. సాధారణంగా ఒక సినిమాలో హీరో డ్యూయల్ రోల్ చేయాల్సి వస్తే దాన్ని చిత్ర యూనిట్ చాలా గోప్యంగా ఉంచుతారు.

సినిమా రిలీజ్ తర్వాత సినిమాలో డ్యూయల్ రోల్ ఉంది అంటూ ట్విస్ట్ ఇచ్చి సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు. కానీ, GOAT విషయంలో వెంకట్ ప్రభు గానీ, విజయ్ దళపతి కానీ, అలాంటివి చేయకుండా టైటిల్ రిలీజ్ చేసినప్పుడే డ్యూయల్ రోల్ అని అధికారికంగా రివీల్ చేశారు. ఇది సినిమాకు చాలా ప్లస్ అయింది. అయితే ఇది ఇలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించి ఒక విషయం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.

అందేంటంటే… ఈ సినిమాకు సంబంధించి, టాలీవుడ్ హీరో, జబర్ధస్త్ ఫేం సుడిగాలి సుధీర్ ను వెంకట్ ప్రభు, విజయ్ దళపతి కాపీ కొట్టారని నెటిజన్లు అంటున్నారు. సుధీర్ ను విజయ్ కాపీ కొట్టాల్సిన అవసరం ఏంటి అంటారా? టైటిల్ విషయంలో అండి. విజయ్ కొత్త సినిమాకు GOAT అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఇదే GOAT టైటిల్ తో సుడిగాలి సుధీర్ చాలా రోజుల క్రితమే సినిమాను అనౌన్స్ చేశాడు. ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశాడు. అంతే కాదు, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.

- Advertisement -

సుడిగాలి సుధీర్ హీరోగా వస్తున్న GOAT సినిమాకు నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నాడు. నరేష్ కుప్పిలి ఇప్పటికే విశ్వక్ సేన్‌తో పాగల్ అనే మూవీని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు