Game Changer: శంకర్- చెర్రీ మధ్య గొడవ.. సినిమా ఆగినట్టేనా..?

Game Changer:  రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం గేమ్ ఛేంజర్.. ఈ చిత్రానికి సంబంధించి అప్డేట్ కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.. ఈ సినిమాని నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. అయితే దిల్ రాజు మాత్రం అప్పుడప్పుడు ఈ చిత్రానికి సంబంధించి పలు విషయాలను తెలియజేస్తూ ఉంటారు. కానీ డైరెక్టర్ శంకర్ కానీ హీరో రామ్ చరణ్ కానీ ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఏ విధంగా స్పందించలేదు. ఇలాంటి సమయంలోనే రామ్ చరణ్ కి శంకర్ కి మధ్య కొన్ని విభేదాలు తలెత్తాయనే వార్తలు వినిపిస్తున్నాయి.

సినిమా షూటింగ్ కి రోజురోజూ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో రామ్ చరణ్, శంకర్ తో కాస్త సీరియస్ గా మాట్లాడినట్లు తెలుస్తున్నది.. అంతే సీరియస్ గా డైరెక్టర్ శంకర్ కూడా రామ్ చరణ్ కి సమాధానం చెప్పినట్లుగా వార్తలైతే వైరల్ గా వస్తున్నాయి..గేమ్ ఛేంజర్ సినిమా ఎక్కడా కూడా డిలే కాకుండా పలు రకాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు దిల్ రాజు. కానీ ఎన్నో కారణాల చేత సినిమా షూటింగ్ డిలే అవుతూనే వస్తోంది. శంకర్ కూడా ఈ సినిమా పై పూర్తిగా ఫోకస్ పెట్టినట్లుగా మొదటి నుంచి కనిపించడం లేదు.

డైరెక్టర్ శంకర్ ఇలా ఎందుకు చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం కావడం లేదు. ఇప్పటికే నిర్మాతలు పెట్టిన పెట్టుబడి భారీగా పెరిగిపోయింది అంటూ దిల్ రాజు లాస్ ని కవర్ చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ అవన్నీ కూడా విఫలమవుతూనే ఉన్నాయి. వీటికి తోడు రామ్ చరణ్ , శంకర్ కి మధ్య విభేదాలు వస్తున్నాయని తెలిసి అసలు ఈ సినిమా షూటింగ్ నడుస్తుందా లేదా అనే విషయం పై క్లారిటీ రావడంలేదని అభిమానులు వాపోతున్నారు.

- Advertisement -

ఈ సినిమాలో నటిస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఏ విధంగా కూడా ఒక విషయాన్ని తెలుపలేదు.. సినిమా షూటింగ్ ఒక్కరోజు చేస్తే ఒక వారం రోజులు వాయిదా పడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. RRR సినిమా తర్వాత చేస్తున్న సినిమా కావడంతో భారీ హైప్ ఏర్పడుతోంది. దాదాపుగా రామ్ చరణ్ సినిమా విడుదల కాక రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. మరి అసలు విషయం పై చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు