Prabash -Bunny: బయ్యర్లను భయపెడుతున్న ప్రభాస్- బన్నీ..!

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద గట్టిగా వినిపిస్తున్న పేర్లు రెండే రెండు.. ఒకటి కల్కి 2898 AD. మరొకటి పుష్ప-2. ఈ రెండు సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. డార్లింగ్ ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో రూ.500 కోట్లకు పైగా బడ్జెట్‌తో కల్కి 2898 ఏడి సినిమాను తెరకెక్కిస్తున్నారు.. మే నెలలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది.. సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి.. కంప్లీట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా కావడంతో అటు ప్రభాస్ అభిమానులను ఇటు సినీ ప్రేక్షకులలో ఆసక్తి ఎక్కువైంది.

వెనుకడుగు వేస్తున్న బయ్యర్లు..
అయితే సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి కానీ సినిమాను కొనడానికి బయ్యర్లు మాత్రం ముందుకు రావడం లేదు.. దీనికి ప్రధాన కారణం నిర్మాత అశ్వినీ దత్ చెబుతున్న ధరలే అని చెప్పాలి.. ఏరియా వారీగా ఈ సినిమా హక్కుల కోసం నిర్మాత భారీగా డిమాండ్ చేస్తున్నారట. ఒక్కో ఏరియాకి ఒక్కో ధర నిర్ణయిస్తూ ఉండడంతో బయ్యర్లు వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. ఓవర్సీస్ హక్కుల కోసం రూ.100 కోట్లు కోట్ చేసిన ఈయన.. నైజాం రైట్స్ కోసం రూ.80 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాకి ఈ స్థాయిలో డిమాండ్ చేసినా కూడా బయ్యర్లు కొనడానికి ముందుకు వచ్చారంటే దానికి కారణం బాహుబలి సక్సెస్.

అయితే నాగ్ అశ్విన్ మహానటి సినిమా మాత్రమే చేశారు. చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు కల్కి సినిమా చేస్తున్నారు. ప్రభాస్ ఇమేజ్ పరంగా చూసుకున్నా కూడా అంత పెట్టడం అంటే రిస్క్ తో కూడుకున్న పని. నిజానికి ప్రభాస్ ఇమేజ్ ను నమ్ముకుని సలార్ కోసం బయ్యర్లు ఊహించని విధంగా ఖర్చుపెట్టినా పెద్దగా లాభాలు అయితే రాలేదు. దాంతో ఈ సినిమాను కొనుక్కోవడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

పుష్ప 2 పై కన్ఫ్యూజన్..
మరొకవైపు పుష్ప -2 సినిమా ఓవర్సీస్ హక్కుల కోసం కూడా మైత్రి మూవీ నిర్మాతలు కూడా రూ.100 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ సినిమా హక్కుల కోసం భారీగానే డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి పుష్ప సినిమా తెలుగు రాష్ట్రాలలో ఆడియన్స్ ని పెద్దగా మెప్పించలేదు.    అతి కష్టం మీదే బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ని అందుకుంది.. అటు నార్త్, కోలీవుడ్ , మలయాళీ ఇండస్ట్రీలో మాత్రమే ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది .. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమా మీద విపరీతమైన క్రేజ్ ఉండడంతో నిర్మాతలు భారీగా డిమాండ్ చేస్తున్నారు . అయితే బయర్లు మాత్రం కొనడానికి రావడం లేదనే మాట వినిపిస్తోంది.

అలా చేస్తే తప్ప కుదరదు..
ఈ సినిమాలకు సంబంధించిన టీజర్, ట్రైలర్ లాంటిది విడుదల చేసి హైప్ క్రియేట్ చేయగలిగితే పబ్లిక్ ఇంట్రెస్ట్ ని బట్టి బయ్యర్లు కూడా కాస్త ధైర్యంగా ముందడుగు వేసే అవకాశం అయితే ఉండొచ్చు..

రెండు చిత్రాలపై సందేహాలు..
నిజానికి కల్కి సినిమాపై ఇప్పటివరకు వచ్చిన పోస్టర్లు పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు.. మరొకవైపు పుష్ప 2 రిలీజ్ పై కూడా కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది.. కాబట్టి రెగ్యులర్ ప్రమోషన్స్ కి ఇంకా టైం ఉంది. ఈ సినిమాలతో ఎలాగైనా రూ .కోట్ల బిజినెస్ మార్కులు టచ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు . మరి ఈ సినిమాలు అంచనాలకు తగ్గట్టుగా ప్రేక్షకులను మెప్పిస్తాయో లేదో చూడాలి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు