Devara Shooting Update: కోలుకున్న భైరా.. దేవరతో సెట్స్ పైకి ఆరోజే!

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో “దేవర” ఒకటి. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ లో కూడా విపరీతమైన అంచనాలున్నాయని తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర గా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటూ ఉండగా, సమ్మర్ కి రావాల్సిన సినిమా షూటింగ్ డిలే కారణంగా దసరా కి షిఫ్ట్ అయింది. అయితే దీనికి చాలా కారణాలే ఉన్నాయి. ముందుగా ఈ సినిమా స్క్రిప్ట్ డెవలెప్మెంట్ కోసం కొన్నాళ్ళు మొదట్లోనే షూటింగ్ వాయిదా వేశారు. అప్పట్లోనే ఈ సినిమా ఖచ్చింతగా వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి, అదే నిజమైంది కూడా. ఇక రీసెంట్ గా ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్ గాయం కారణంగా మరికొన్ని రోజులు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. అయితే సైఫ్ లేని షెడ్యూల్స్ ని కొన్ని రోజులు చిత్రీకరించడం జరిగింది. అన్నిటికి మించి ఈ సినిమాకి మ్యూజిక్ ఇస్తున్న అనిరుధ్ టైం కి ట్యూన్స్ ఇవ్వకపోవడం కూడా ఈ దేవర వాయిదాకు కారణం అయిందని చెప్పొచ్చు. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఇప్పుడు మళ్ళీ దేవర నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుందని సమాచారం.

భైరా రెడీ.. అక్కడే యుద్ధం..

తాజాగా వచ్చిన సమాచారం సైఫ్ అలీఖాన్ గాయం నుండి కోలుకున్నాడని తెలుస్తుంది. అంతే కాదు దేవర నెక్స్ట్ షెడ్యూల్ ని కూడా మేకర్స్ ప్లాం చేసారు. గాయం నుండి పూర్తిగా కోలుకున్నాక షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఇక ఆ షూటింగ్ లో భైరా గా సెట్స్‌లో సైఫ్ అలీ ఖాన్ జాయిన్ అవుతున్నాడని సమాచారం. ఇక దేవర తదుపరి షెడ్యూల్ మార్చి 19న గోవాలో ప్రారంభమవుతుందని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ షెడ్యూల్ లో జూనియర్ ఎన్టీఆర్ సైఫ్ అలీఖాన్ మధ్య కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తారని టాక్ నడుస్తుంది. ఈ షెడ్యూల్ లోనే జాన్వీ కపూర్ కూడా ఎంట్రీ ఇస్తుందని సమాచారం. ఈ సీన్స్ కూడా సినిమాకి చాలా కీలకం అని టాక్. ఇక జాన్వీ కపూర్ ఈ సినిమా లో సైఫ్ అలీఖాన్ కూతురుగా నటిస్తుందని ఎప్పట్నుంచొ వార్తలు వస్తున్నాయి.

- Advertisement -

రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్లలో నటిస్తున్నారని టాక్. ఇక విలన్ గా సైఫ్ అలీఖాన్ సెకండ్ హాఫ్ లోనే ఎంట్రీ ఇస్తాడని, అక్కడినుండి సెకండ్ పార్ట్ లో కూడా వీళ్ళ యుద్ధం కొనసాగుతుందని టాక్ నడుస్తుంది. అయితే రెండో పార్ట్ లో మరో స్ట్రాంగ్ విలన్ కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. 200 కోట్లకి పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఇక రిలీజ్ టైం కల్లా ఈ సినిమా బడ్జెట్ మరింత దాటిపోతుందని లెక్కలు చెప్తున్నాయి. విజయదశమి కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ కాబోతున్న ఈ దేవర అప్పటికి ఏ రేంజ్ లో రెడీ అవుతాడో, ఏ స్థాయిలో అంచనాలను అందుకుంటాడో చూడాలి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు