Lal Salam : 21 రోజుల షూటింగ్ ఫుటేజ్ మిస్సయింది

రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ్ సినిమాల్లో నేపథ్యగాయనిగా, దర్శకురాలుగా తనకంటూ ఒక గుర్తింపును సాధించుకుంది ఐశ్వర్య రజనీకాంత్. అయితే 2012లో రిలీజ్ అయిన 3 అనే సినిమాతో దర్శకురాలుగా తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య రజనీకాంత్. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని అందుకోలేదు. అదే సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకి మెయిన్ బజ్ రావడానికి కారణం కొలవరి డీ అనే సాంగ్. ఈ సాంగ్ తో ప్రపంచ నలుమూలల ప్రసిద్ధి చెందింది ఈ మూవీ టీం. ఆ తర్వాత ఇప్పటివరకు దాదాపు నాలుగు సినిమాలను చేసింది ఐశ్వర్య. లేటెస్ట్ గా దర్శకత్వం వహించిన సినిమా లాల్ సలాం.

ఈ సినిమాలో రజనీకాంత్ ఒక కీలక పాత్రలో కనిపించారు. మామూలుగా రజనీకాంత్ సినిమా అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రజినీకాంత్ సినిమా వస్తుందంటేనే ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. కేవలం తమిళ్లోనే కాకుండా తెలుగులో కూడా రజనీకాంత్ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. అయితే ఈ సినిమాలో రజనీకాంత్ నటించిన కూడా ఎటువంటి అంచనాలు లేకుండా ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా తుది ఫలితం మాత్రం డిజాస్టర్ గానే మిగిలిందని చెప్పొచ్చు.

అసలు ఈ సినిమా కథ విషయానికి వస్తే..
దేశవ్యాప్తంగా ఒక కుదుపు కుదిపిన మసీదు కూల్చివేత ఘటన తరువాత 1993లో జరిగిన కథ ఇది. అప్పటి కసుమూరు అనే ప్లేస్ లో హిందూ, ముస్లింలు మంచి చనువుగా కలిసి ఉండేవారు. అక్కడ ఒక టైం లో క్రికెట్ మ్యాచ్ లో పెద్ద గొడవ జరుగుతుంది. ఇకపోతే అదే ఊరు నుంచి వెళ్లి బొంబాయిలో సెట్ అయిన మొయిద్దీన్ (రజినీ కాంత్) కొడుకు శంషుద్దీన్‌(విక్రాంత్) చేతిని గురు (విష్ణు విశాల్) నరకడంతో అది రెండు మతాల మధ్య గొడవలకు దారి తీస్తుంది. చివరికి గురు, శంషుద్దీన్ తమ పగ పక్కన పెట్టి ఎందుకు కలవాల్సి వచ్చింది? అనేది ఈ సినిమా కథ.

- Advertisement -

ఇకపోతే రీసెంట్ గా ఒక తమిళ్ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఒక కీలకమైన సంఘటనను చెప్పుకొచ్చారు ఐశ్వర్య రజనీకాంత్. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక హార్డ్ డిస్క్ మిస్ అయిందని, దాదాపు 20 రోజులు షూట్ ఉన్న ఆ హార్డ్ డిస్క్ పోయిందని చెప్పుకొచ్చారు. అయితే మళ్లీ రీషూట్ చేయటానికి పాజిబిలిటీస్ లేక ఉన్న సినిమానే అడ్జస్ట్ చేసి ఎడిట్ చేశారని అందువల్లనే ఈ సినిమా రిజల్ట్ ఇలా వచ్చిందని చెప్పుకొచ్చారు.

అలానే రజనీకాంత్ పాత్ర ఈ సినిమాలో మొదటి కేవలం పది నిమిషాలు మాత్రమే ఉందని, తరువాత రజినీకాంత్ ఫ్యాన్స్ ని ఆయన ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఆ క్యారెక్టర్ కాస్త పొడిగించడం వలన సినిమా కథ పక్కకెళ్ళిపోయిందని ఇదివరకే ఒక సందర్భంలో చెప్పారు ఐశ్వర్య రజినీకాంత్.

ఏదేమైనా సినిమా తుది ఫలితం అనేది ప్రేక్షకులకు అవసరం తప్ప, ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఏం జరిగింది.? అనేది ఎవరు పరిగణలోకి తీసుకోరు. చివరగా సినిమా సక్సెస్ ఆ ఫెయిల్యూరా అనేది మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద డిసైడ్ అవుతుంది. ఏదేమైనా ఒక సినిమాకు సంబంధించిన ప్రాసెస్ లో అంత అజాగ్రత్తగా ఉండడం కూడా కరెక్ట్ కాదనేది కొంతమంది అభిప్రాయం.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు