Rajinikanth: వెట్టియన్ అప్డేట్ ఇచ్చిన తలైవర్

సూపర్ స్టార్ రజినీకాంత్, ఇది కేవలం పేరు కాదు ఇది ఒక ప్రభంజనం. మామూలుగా రజనీకాంత్ తమిళ్ హీరో అయినా కూడా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితులు. రజనీకాంత్ సినిమా వస్తుంది అని అంటే తెలుగు ప్రేక్షకులు కూడా ఒకప్పుడు థియేటర్ దగ్గర క్యూ కట్టేవాళ్ళు. ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో రజనీకాంత్ హవా కొంతమేరకు తగ్గింది అని అనుకుంటున్న తరుణంలో జైలర్ సినిమాతో బీభత్సమైన హిట్ సాధించి గ్రేట్ కంబ్యాక్ ఇచ్చాడు రజిని.

బీస్ట్ సినిమాతో ఫెయిల్యూర్ చవిచూసిన నెల్సన్ జైలర్ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చి డైరెక్టర్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. మళ్ళీ జైలర్ 2 సినిమాని రజనీకాంత్ తో చేయనున్నాడు నెల్సన్. ఇకపోతే రజనీకాంత్ ప్రస్తుతం టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో పాల్గొంటున్నారు. ఈ సినిమాకి వెట్టైయాన్ అని టైటిల్ ను ఖరారు చేసినట్లు అందరికీ తెలిసిందే.

జై భీమ్ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు టీజే జ్ఞానవేల్. ఆ తర్వాత రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ తో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అయితే ఈ సినిమా భారీ తారాగణంతో తెరకెక్కుతుంది అని చెప్పొచ్చు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, మంజు వారియర్, దగ్గుపాటి రానా వంటి చాలామంది ప్రముఖులు కనిపించనున్నారు.

- Advertisement -

అయితే ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో కొంతమేరకు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ షూటింగ్ నిమిత్తం సూపర్ స్టార్ హైదరాబాద్ కి వచ్చిన తరుణంలో చెన్నై ఎయిర్ పోర్ట్ లో కొంతమంది మీడియా ప్రముఖులు రజనీకాంత్ ని సినిమా గురించి అడగగ దాదాపు 70% వరకు పూర్తయిపోయిందని చెప్పుకొచ్చారు. అయితే తలైవర్ 171 పేరుతో మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

లోకేష్ కనకరాజ్ రజినీకాంత్ 171 వ సినిమాని చేయనున్నారు. అయితే ఈ సినిమా అప్డేట్ గురించి కూడా రజినీకాంత్ మాట్లాడారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన వర్క్ ఇంకా మొదలుకాలేదంటూ చెప్పుకోచ్చారు. ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు. లోకేష్ కనకరాజ్ చేసిన విక్రమ్, మాస్టర్, లియో వంటి సినిమాలకు అద్భుతమైన సంగీతంతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించాడు అనిరుద్.

ఇకపోతే రజనీకాంత్ హిట్ అందుకున్న జైలర్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన స్టైల్ అండ్ స్వాగ్ తో ఆ సినిమాను అద్భుతంగా నడిపాడు నెల్సన్. అయితే వెట్టైయాన్ సినిమాలో కూడా మళ్లీ పోలీస్ గెటప్ లో కనిపించనున్నారు రజినీకాంత్. అయితే జైలర్ సినిమా చూపించిన ఇంపాక్ట్ ను మళ్లీ అంతకుమించి ఈ సినిమా చూపిస్తుందా లేదా తెలియాలి అంటే కొంతకాలం వెయిట్ చేయక తప్పదు. ఈ సినిమాలో పెద్ద పెద్ద నటులు కనిపించడం వలన ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక రీసెంట్ గా తలైవర్ నటించిన లాల్ సలాం సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు