Happy Birthday Reethu Varma: అన్ స్టాపబుల్ జర్నీ

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలద్రొక్కుకోవడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ వారిలో కొందరు మాత్రమే పర్ఫెక్ట్ గా వాళ్ల కెరియర్ ప్లాన్ చేసుకొని మంచి స్క్రిప్ట్స్ ను సెలెక్ట్ చేసుకొని తనకంటూ ఒక గుర్తింపును సాధించుకొని హీరోయిన్ గా నిలబడతారు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరియర్ షార్ట్ చేసి తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి నేడు హీరోయిన్ గా తనకంటూ ఒక ప్లేస్ ను సాధించుకుంది రీతు వర్మ.

శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన బాద్షా సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించింది రీతూ వర్మ. ఆ తర్వాత పవన్ సాధినేని దర్శకత్వం వహించిన ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో సమీరా క్యారెక్టర్ లో కనిపించింది. ఆ తర్వాత నాగ అశ్విన్ దర్శకత్వం వహించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో కనిపించి తనకంటూ ఒక గుర్తింపును సాధించుకుంది.

అయితే రీతూ వర్మ కి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం పెళ్లిచూపులు అని చెప్పొచ్చు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాగా వచ్చి పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ సినిమా. ఈ సినిమాలో చిత్ర క్యారెక్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అంత అద్భుతంగా ఆ క్యారెక్టర్ డిజైన్ చేశాడు తరుణ్ భాస్కర్.

- Advertisement -

పెళ్లి చూపులు సినిమా తర్వాత సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన కేశవ అనే సినిమాలో కూడా నటించింది రీతు. అయితే ఇలా తెలుగులో సినిమాలు చేస్తూనే తమిళ్లో కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి సూపర్ హిట్ సినిమాలను అందుకుంది. ఆ తర్వాత నాని సరసన టక్ జగదీష్, నాగశౌర్యతో వరుడు కావలెను, శర్వానంద్ తో ఒకే ఒక జీవితం లాంటి మంచి సినిమాలు చేసింది.

తెలుగు హీరోయిన్ గా మంచి గుర్తింపు సాధించుకున్న రీతూ తమిళ్ లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకుంది. ఇక రీతూ వర్మ స్క్రిప్ట్ సెలక్షన్ విషయానికి వస్తే రీతూ వర్మ కెరియర్ లో మంచి హిట్ సినిమాలు ఉన్నాయని చెప్పొచ్చు. పెళ్లిచూపులు, ఒకే ఒక జీవితం, కేశవ వంటి సినిమాలు రీతూ వర్మ కెరియర్ లో ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పొచ్చు.

తెలుగులో హీరోయిన్ ను గుర్తించట్లేదు, తెలుగు హీరోయిన్లకు అవకాశాలు రావట్లేదని కొందరు ఏడుస్తున్న తరుణంలో టాలెంట్ ఉంటే ఎక్కడైనా ప్రూవ్ చేసుకోవచ్చు అని తనను తాను ప్రూవ్ చేసుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకొని నేడు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది రీతూ వర్మ. ఇలానే మరిన్ని సినిమాలు చేస్తూ తెలుగు,తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలో కాకుండా మిగతా ఇండస్ట్రీలో కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సాధించుకొని కెరియర్ లో ముందుకెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఫిల్మీ ఫై తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు