Ananya Nagella: నేనేప్పుడు అది ఫేస్ చెయ్యలేదు

2019లో రిలీజ్ అయిన మల్లేశం సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అనన్య నాగళ్ళ. అయితే ఆ సినిమా కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద హిట్ కాలేదు. కానీ ఆ సినిమాకి మంచి ప్రశంసలు దక్కాయి. ఆ సినిమాతో అనన్య నాగళ్ళ మంచి పేరు సంపాదించుకుంది. ఆ సినిమాలోని అనన్య చేసిన పాత్ర సైమా అవార్డ్స్ కూడా నామినేట్ అయింది.

ఆ సినిమా తర్వాత అనన్య చేసిన సినిమా ప్లే బ్యాక్. ఈ సినిమా కూడా ఊహించిన స్థాయిలో కమర్షియల్ గా హిట్ కాలేదు. కానీ సినిమా మాత్రం పర్వాలేదు అనిపించుకుంది. హరిప్రసాద్ జక్కా దర్శకత్వం వహించిన ఈ సినిమా చాలామందిని ఆకట్టుకుంది అని చెప్పొచ్చు. ఈ సినిమాతో అనన్యకి మంచి గుర్తింపు కూడా లభించింది.

అయితే అనన్యకి ఒక బ్రాండ్ ఇమేజ్ ని తీసుకొచ్చి పెట్టింది మాత్రం వకీల్ సాబ్ సినిమా అని చెప్పొచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చిన సినిమా వకీల్ సాబ్. హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన పింక్ అనే సినిమాకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమాని రీమేక్ చేస్తున్నప్పుడు చాలామంది పెదవి విరిచారు. కానీ వారందరికీ సమాధానం వేణు శ్రీరామ్ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు.

- Advertisement -

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కావలసినటువంటి ఎలిమెంట్స్ ని ప్రతిసారి పర్ఫెక్ట్ గా చూపిస్తూ సినిమాని హిట్ దిశ గా మలిచాడు. అయితే ఈ సినిమా అనన్య కెరియర్ లో మంచి ప్లస్ అని చెప్పొచ్చు. ఇప్పటికీ అనన్య అంటే గుర్తొచ్చేది వకీల్ సాబ్ సినిమానే. అనన్య ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది. అయితే ఆ సినిమాలేవి సరైన గుర్తింపును తీసుకొని రాలేదు.

ఇకపోతే అనన్య ప్రస్తుతం తంత్ర అనే ఒక సినిమాను చేస్తుంది. ఈ తంత్ర సినిమా హర డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమా మార్చి 15న రిలీజ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా ప్రోమోషన్స్ ను జరుపుకుంటుంది. ఈ సినిమా ప్రోమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో అనన్య నాగళ్ళకి ఒక ప్రశ్న ఎదురైంది. కాస్టింగ్ కౌచ్ గురించి అనన్యను అడిగారు.

అయితే అనన్య దీనికి సమాధానంగా కాస్టింగ్ కౌచ్ గురించి నేను కూడా చాలా విన్నాను. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంటుందని చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ నాకైతే ఇప్పటివరకు అలాంటి అనుభవాలు ఎదురుగా కాలేదని క్యాస్టింగ్ కౌచ్ నేను ఫేస్ చేయలేదు అంటూ తను చెప్పుకొచ్చింది.

అలానే తన కెరియర్ స్టార్టింగ్ లో కూడా ఇలా కాస్టింగ్ కౌచ్ గురించి ఎవరు ఫోర్స్ చేయలేదంటూ చెప్పుకొచ్చింది. ఇకపోతే అనన్య చేసిన సినిమాల్లో వకీల్ సాబ్ మినహా మిగతా సినిమాలేవి తన కెరీర్ లో ప్రత్యేకమైన గుర్తింపును తీసుకురాలేదు. కానీ ఇప్పుడు చేస్తున్న తంత్ర సినిమా అనన్య కెరియర్ కి ఎంతవరకు ప్లస్ అవుతుందో తెలియాలి అంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడక తప్పదు. ఇకపోతే అనన్య సినిమాలు చేయడంతో పాటు ఇంస్టాగ్రామ్ లో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు