Rohan Rai: వామ్మో 90’s కిడ్ రెమ్యునరేషన్ అంతా..?

సాధారణంగా మిగతా ఇండస్ట్రీలతో పోల్చుకుంటే టాలీవుడ్లో అవకాశాలు రావడం చాలా కష్టం అంటారు.. ఎందుకంటే ఒకసారి అవకాశం వస్తే దానిని సరిగ్గా వాడుకోవడం తెలిసి ఉండాలి..టాలెంట్ ఉంటే సరిపోదు సరైన సమయంలో సరైన విధంగా అవకాశాలు ఒడిసి పట్టుకొని.. తమ తెలివితేటలను ఉపయోగించి..నటనను ప్రదర్శించగలగాలి.. ఇవన్నీ సరిగ్గా ఫాలో అయినప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు. సరిగ్గా ఇలాంటి అవకాశాన్ని అందుపుచ్చుకొని ఇప్పుడు అందరి దృష్టిలో పడిపోయారు. చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ రాయ్.. మినీ సెలబ్రిటీ అయిపోయిన ఈ చిన్నారి వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్ చిన్నప్పటి క్యారెక్టర్ చేసి అటు టాలీవుడ్ లో ఇప్పుడు వెబ్ సిరీస్లలో కూడా గట్టిగానే పేరు సంపాదించుకుంటున్నారు.

అందరి దృష్టిని ఆకర్షిస్తున్న రోహన్ రాయ్..
తాజాగా ఆహా ఈటీవీ యాప్ లో #90’s అనే వెబ్ సిరీస్ లో తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు ఈ స్టార్ కిడ్..ఇక ఈ వెబ్ సిరీస్ తర్వాత రోహన్ క్రేజ్ ఎంతలా పెరిగింది అంటే.. దీంతో అందరూ రోహన్ రెమ్యునరేషన్ గురించి చర్చించుకుంటూ ఉండడం గమనార్హం.. రోహన్ రాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ బిజీ మిని ఆర్టిస్ట్ గా పేరు దక్కించుకున్న రోహన్ రాయ్ కి 90’s వెబ్ సిరీస్ తర్వాత భారీగా డిమాండ్ పెరిగింది.. ముఖ్యంగా ” సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని” అనగానే రోహన్ రాయ్ ఎక్స్ప్రెషన్ గుర్తొస్తుంది. అంతేకాదు ప్రమోషన్స్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్న రోహన్ రాయ్ ఇటీవలే మమ్ముట్టి చిత్రంలో కూడా నటించాడు.. అలా వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ ఒక మెరుపులా మెరుస్తున్న ఈ చిన్నారి కి అవకాశాలు బాగానే వస్తున్నాయి..

హాట్ టాపిక్ గా మారిన రోహన్ రెమ్యునరేషన్..
ఇకపోతే ఇప్పుడు రోహన్ రాయ్ రెమ్యునరేషన్ వివరాలు నిజంగానే ఆశ్చర్యపరుస్తున్నాయని చెప్పవచ్చు.. ఎందుకంటే ఈ చిన్నారి ఇప్పుడు ప్రాజెక్టు లెక్క కాకుండా రోజుల మాదిరి రెమ్యునరేషన్ తీసుకున్నారంట.. అంటే స్టార్ సెలబ్రిటీ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉండడం గమనార్హం.. రోజుకి రూ.30 వేల చొప్పున డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.. అంటే సినిమా షూటింగ్లో ఎన్ని రోజులు పాల్గొంటే అన్ని రోజులు.. ఆ సినిమా నిర్మాత.. రోజుకు రూ.30,000 చొప్పున రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.. అది మనోడి రేంజ్ ..

- Advertisement -

రెమ్యునరేషన్ మాత్రమే కాదు ఆ ఖర్చులు కూడా..
పైగా రోహన్ రాయ్ ఫ్యామిలీ బెంగళూరులో సెటిల్ అయింది.. కాబట్టి రాను పోనూ ఫ్లైట్ చార్జెస్ తో పాటు హోటల్ లో స్టే చేయడానికి కావలసిన ఖర్చులు కూడా నిర్మాతలే భరించాల్సి ఉంటుంది.. మొత్తానికైతే ఈ చిన్నారికి రోజుకి రూ.40 నుంచి రూ.50 వేలు ఖర్చు అవుతుంది అనడంలో సందేహం లేదు..ఎంత చిన్న రోల్ వచ్చినా సరే దానిని షూట్ చేయాలి అంటే కచ్చితంగా నెలరోజులైనా సమయం పడుతుంది. ఒకవేళ ఫుల్ లెంగ్త్ రోల్ వచ్చిందంటే మాత్రం 60 రోజుల పై మాటే ..అప్పుడు 60 రోజులకి రూ.30,000 చొప్పున అనుకున్న రోహన్ రాయ్ కి రూ.18 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది ..ఒక జూనియర్ ఆర్టిస్ట్ కి కూడా ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ ఇవ్వరు అనడంలో సందేహం లేదు. మొత్తానికైతే అటు ట్రావెలింగ్ ఇటు స్టే ఖర్చులు అదనంగా తీసుకుంటూ ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న రోహన్ రాయ్ ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇకపోతే రోహన్ రాయ్ లో కేవలం నటుడు మాత్రమే కాదు మిమిక్రీ ఆర్టిస్ట్, ఇమిటేషన్ లాంటి టాలెంట్స్ చాలా ఉన్నాయి..

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు