Aadukaalam: వరద రాజ్ మన్నర్ పై దేవ వ్యాఖ్యలు

మలయాళం స్టార్ హీరో పృధ్విరాజ్ సుకుమారన్ గురించి సినిమా ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కువగా సినిమాలు చూసి ఆడియన్స్ అందరికీ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇదివరకే తెలుసు. ఇక రీసెంట్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ సినిమాతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు పృథ్వీరాజ్. కేవలం నటుడుగానే కాకుండా దర్శకుడుగా కూడా తన టాలెంట్ ను చూపించాడు పృథ్విరాజ్.

ఇకపోతే పృథ్వీరాజ్ నటించిన లేటెస్ట్ ఫిలిం “ది గోట్ లైఫ్” ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమాను బెన్యామిన్ రాసిన “గోట్ డేస్” అనే నవల ఆధారంగా అవార్డు విన్నింగ్ డైరెక్టర్ బ్లేస్సి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

ఇక ఈ ట్రైలర్ విషయానికొస్తే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది అని చెప్పొచ్చు. ది గోట్ లైఫ్ అనే ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లారు. ఈ ట్రైలర్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ వివిధ గెటప్ లో కనిపించిన తీరు సినిమాపై అంచనాలను మరింత పెంచుతుంది. అద్భుతమైన విజువల్స్ తో పాటు ఎడారి లొకేషన్స్ ను, హీరో క్యారెక్టర్ ను దానిలోని ఎమోషన్స్ ను హార్ట్ టచ్చింగ్ గా ట్రైలర్ లో చూపించారు.

- Advertisement -

ఇకపోతే ఈ సినిమాను దాదాపు గత పదేళ్లుగా తీస్తున్నారు. ఈ విషయం పైన దర్శకుడు మాట్లాడుతూ గాంధీ సినిమాను రూపొందించేందుకు దర్శకుడు రిచర్డ్ అటెన్ బరోకు 20 ఏళ్లు పట్టింది. ది గోట్ లైఫ్ సినిమా కోసం మేము పదేళ్ళు సమయం తీసుకున్నాము. ఈ సినిమాతో కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాం. ఆడియన్స్ దీనిని ఎంజాయ్ చేస్తారంటే చెప్పుకొచ్చారు.

ఇకపోతే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ప్రభాస్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ఎదురు చూస్తూ ఉంటారు. అంతటి గుర్తింపును, స్థాయిని సాధించుకున్నాడు ప్రభాస్. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ స్థాయి అమాంతం పెరిగిపోయిన విషయం మనకు తెలిసిందే. అయితే ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి అని నానుడి ఉన్నట్లు ప్రభాస్ అలానే ఉంటున్నారు అని చెప్పొచ్చు.

రీసెంట్ గా ప్రభాస్, పృధ్విరాజ్ సుకుమారన్ కలిసి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో వీరిద్దరూ స్నేహితులుగా కనిపించారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్ ఆడు కాలం ట్రైలర్ రిలీజ్ అవ్వడంతో, ప్రభాస్ ఇంస్టాగ్రామ్ లో దానిని షేర్ చేస్తూ తన బెస్ట్ విషెస్ ను పృథ్వీరాజ్ సుకుమారన్ కి తెలిపారు. కేవలం పృథ్వీరాజ్ కే కాకుండా చాలా సినిమాలను ప్రభాస్ ఇలా ప్రోమోట్ చేస్తూ ఉంటాడు. ఇలా చేయటం అనేది చాలామందికి ప్రభాస్ గొప్పతనం. అందుకే ప్రభాస్ ను డార్లింగ్ అని చాలామంది పిలుస్తారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood newsMovie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు