Salaar: ఒక్క సినిమాతో సోషల్ మీడియా లో ఫుల్ బిజీ..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన “సలార్” సినిమా డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి సాలిడ్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మరీ వెయ్యి కోట్ల వసూళ్లు అందుకోలేక పోయినా ప్రభాస్ ఫ్యాన్స్ కి మాత్రం మాంచి కిక్ ఇచ్చింది. ఇక ఈ సలార్ సీస్ ఫైర్ తర్వాత రెండో పార్ట్ పై కూడా భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. అయితే ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రభాస్, పృత్వి రాజ్ పాత్రల తరవాత ఆ రేంజ్ లో పాపులర్ అయిన క్యారెక్టర్ “రాధా రమా” పాత్ర.

జగపతి బాబు కూతురుగా కోలీవుడ్ నటి శ్రీయా రెడ్డి నటించిన ఈ నెగిటివ్ పాత్ర చాలా పవర్ ఫుల్ రోల్ కాగా, ఆ పాత్రలో శ్రీయా రెడ్డి జీవించిందనే చెప్పాలి. అయితే హీరోయిన్ గా శ్రీయ రెడ్డి అంతగా సక్సెస్ అవకపోయినా విలన్ గా మాత్రం మంచి పేరు తెచ్చుకుందని చెప్పాలి. ఇంతకు ముందు విశాల్ నటించిన పొగరు లో ఇలాంటి నెగిటివ్ టచ్ ఉన్న రోల్ లోనే నటించగా, చాలా ఏళ్ళ తరువాత శ్రీయా రెడ్డి మళ్ళీ తన కెరీర్ లో మంచి అరుదైన పాత్రలో నటించిందని చెప్పాలి.

ఇక సలార్ రిలీజ్ కి ముందు నుండి శ్రీయా రెడ్డి సోషల్ మీడియా లో ఉన్నప్పటికీ అంతగా ఫామ్ లో లేదు. కానీ సలార్ రిలీజ్ తర్వాత మాత్రం ఓ రేంజ్ లో పాపులర్ అయింది. ముఖ్యంగా సోషల్ మీడియా లో ఎలాంటి పోస్ట్ చేసినా యిట్టె వైరల్ అయిపోతుంది. ఇక గత కొన్ని రోజులుగా సలార్ సినిమాలోని లుక్స్ తోనే ఫోటోషూట్స్ చేసిన శ్రీయా రెడ్డి, ఇప్పుడు గ్లామర్ షోస్ చేస్తూ రచ్చ చేస్తుంది. ఏది ఏమైనా సలార్ తర్వాత సోషల్ మీడియా లో ఫుల్ బిజీ అయింది రాధా రమా అలియాస్ శ్రీయా రెడ్డి.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood newsMovie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు