Ruhani sharma: ఆఫర్లేమో గాని ఫోటోషూట్లకేమి తక్కువకాదు..?

టాలీవుడ్ లో “చి.ల.సౌ” అనే చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చి యువతను గిలిగింతలు పెట్టి అట్రాక్ట్ చేసిన హీరోయిన్ రుహని శర్మ. చేసింది తక్కువ సినిమాలే అయినా తన గ్లామర్ తో ఆకట్టుకుంది. పెర్ఫార్మన్స్ రోల్స్ తో పాటు ఏ పాత్ర ఇచ్చినా చేయడానికి తాను రెడీ అంటూ పలు ఇంటర్వ్యూలలో కూడా చెప్పిన ఈ భామ తాజాగా సైన్ధవ్ సినిమాలో కీ రోల్ లో నటించింది. అయితే ఈ భామకు టాలెంట్ ఉన్నా హిట్లు మాత్రం కరువయ్యాయి.

మొదటి సినిమా చిలసౌ మినహా మరో హిట్ లేదు. మధ్యలో వేరే భాషల్లో సినిమాలు చేసినా అక్కడ కనీసం పట్టించుకోలేదు. ఇక తెలుగులో అడపాదడపా ఛాన్సులు వస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా రుహని శర్మ సంక్రాంతికి చేసిన ఫోటో షూట్స్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అయ్యాయి. ఆ ఫోటోషూట్లలో కనిపించి కనిపించనట్టు తెలుగమ్మాయి గా చీరకట్టుకో అందాలు ఒలకబోసింది. ఇక ఆ స్టిల్స్ రిలీజ్ చేసిన రెండు మూడు రోజులకే మరో ఫోటో షూట్స్ తో అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా యెల్లో శారీ లో చేసిన ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ఈ ఫోటోషూట్లను గమనించిన నెటిజన్లు మాత్రం సినిమా ఆఫర్లు రావడం లేదు గాని, ఫోటోషూట్లకేమి తక్కువ కాదు ఈ అమ్మడు, మ్యాగజైన్ కవర్ పేజీలకు పోజులివ్వొచ్చుగా అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood newsMovie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు