Ayodhya: రాముల వారికి పవన్ కళ్యాణ్ భారీ విరాళం..!

Ayodhya:  అయోధ్య రామ మందిరానికి రాజకీయ నాయకులే కాదు సినీ ప్రముఖులు కూడా తమ వంతు సహాయంగా భారీ విరాళాలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే నిన్నటికి నిన్న రెబల్ స్టార్ ప్రభాస్ రూ.50 కోట్లు ప్రకటించగా .. ఇప్పుడు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయోధ్య రామ మందిరానికి రూ.30 లక్షలు విరాళంగా ప్రకటించారు. తాజాగా ఆర్ఎస్ఎస్ ముఖ్యులు భరత్ జీ కి.. పవన్ కళ్యాణ్ ఈ రూ.30 లక్షలు చెక్ ను అందించారు. అలాగే పవన్ వ్యక్తిగత సిబ్బంది కూడా రాముల వారికి రూ.11,000 విరాళంగా ఇచ్చారు. ఇకపోతే వీరితోపాటు అయోధ్య రామ మందిరానికి పెద్ద ఎత్తున ప్రజల నుంచి కూడా భారీ విరాళాలు అందుతున్నాయి.

అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ఇక రేపు బాల రాముడి విగ్రహ ప్రతిష్ట ఆలయంలో జరగబోతోంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు జరుగుతుండగా ప్రధాని మోదీ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అంతేకాదు ఈరోజు అయోధ్య మొత్తం ఆయన పర్యటించనున్నట్లు సమాచారం.

ఇక ప్రస్తుతం భారతదేశమంతా అయోధ్య ఫీవర్ పట్టుకుంది.. ఎప్పుడెప్పుడు రాములవారిని దర్శించుకుందామా అని అందరూ ఆత్రుతతో కనబడుతున్నారు. ఇక రేపటితో ఆ ఆతృత కూడా తీరబోతుందని చెప్పవచ్చు. రేపు శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్ట జరగబోతోంది. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి పలువురు సినీ, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలతోపాటు ప్రజలు కూడా స్వామివారిని దర్శించుకోబోతున్నారు.

- Advertisement -

ఇకపోతే సినీ రంగం నుంచి కూడా పలువురు సెలబ్రిటీలు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా విరాళాలు ప్రకటించారు. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ప్రస్తుతం ఒకవైపు సినిమాలు.. మరొకవైపు రాజకీయాలంటూ వేగంగా దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ OG , ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లు ప్రస్తుతం వాయిదా పడ్డాయి.

ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొన్ని రోజులు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో పదవి కాంక్ష కోసం ఆయన తెగ ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులపాటు తన సమయాన్ని రాజకీయాలకే పరిమితం చేసి.. సినిమా షూటింగ్లను వాయిదా వేసినట్లు తెలుస్తోంది . ఇక ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ మూడు సినిమాల షూటింగ్ లు తిరిగి పునః ప్రారంభం కానున్నాయి.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood newsMovie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు