Pawan Kalyan: ఏంటి… పవన్ మరో సినిమానా? సాధ్యం అవుతుందా?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సిల్వర్ స్క్రిన్ పై చూడాలని చూసే వాళ్ల సంఖ్య చాలా పెద్దగా ఉంటుంది. పవన్ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం ఉంటానని అనౌన్స్ చేశాడు. కానీ, తర్వాత తనకు ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా మళ్లీ సినిమాలు చేస్తున్నట్టు చెప్పాడు. ఈ క్రమంలో వకీల్ సాబ్ మూవీతో సిల్వర్ స్క్రిన్ పై రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం, ఆయన చేతికి బాగానే డబ్బులు రావడంతో తర్వాత వరుసగా సినిమాలను లైన్ లో పెట్టాడు.

అందులో భీమ్లానాయక్ ఒకటి రిలీజ్ అయింది. కానీ, దీని తర్వాత అనౌన్స్ చేసిన సినిమాలన్నీ కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. సముధ్ర ఖని దర్శకత్వంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తో కలిసి చేసిన బ్రో మూవీ ఒక్కటే రిలీజ్ అయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత డేట్స్ ఇవ్వకుండా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న సినిమాలు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ‌తో పాటు అన్నింటి కంటే ఫస్ట్ స్టార్ట్ చేసిన హరి హర వీరమల్లు సినిమాలు ఉన్నాయి. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ పై ఓ క్లారిటీ ఉంది. కానీ, పిరియాడిక్ నేపథ్యంలో వస్తున్న హరి హర వీరమల్లు గురించి అయితే ఏ చిన్న క్లారిటీ కూడా లేదు.

దీంతో పాటు సురేందర్ రెడ్డితో మరో సినిమా చేయాల్సి ఉంది. దీనిపై ఓ ప్రకటన కూడా వచ్చింది. కానీ, అది ఇప్పట్లో స్టార్ట్ అయ్యే సూచనలు లేవు. ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అనే వార్త ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చనీయాశంగా మారింది. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో పవన్ సినిమా చేయబోతున్నాడు. దీన్ని కూడా పవన్ సన్నిహితుడు, ఇటీవల గుంటూరు కారం సినిమాతో ట్రోల్స్ అందుకుంటున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సెట్ చేశాడు అనే టాక్ వస్తుంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫోకస్ మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలపైనే ఉంది.

- Advertisement -

ఒక వేళ ఎన్నికల్లో పవన్ ప్రాతినిథ్యం వహిస్తున్న కూటమి విజయం సాధిస్తే… ప్రభుత్వంలో భాగం అయితే, ఆయన నుంచి సినిమాలు రావడం కష్టమే. అలాంటి పరిస్థితే వస్తే.. ఉన్న సినిమాలనే కంప్లీట్ చేయడానికి కదరదు. అప్పుడు కొత్త సినిమాలు చేయడం అవుతుందా?

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు