VD 12 : విజయ్ దేవరకొండతో “యానిమల్” బ్యూటీ… ఇదే నిజమైతే సినిమా పెద్దలకు మాత్రమే?

VD 12 : విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీలో హీరోయిన్ గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ సినిమాలో “యానిమల్” బ్యూటీ నటించబోతోంది అని ప్రచారం జరుగుతోంది. కానీ ఒకవేళ నిజంగానే వీళ్ళిద్దరి కాంబోలో సినిమా ఓకే అయితే అది పెద్దలకు మాత్రమే అనే విధంగా ఉంటుందేమో!?

రౌడీ హీరో విజయ్ దేవరకొండకు టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ హీరో చేస్తున్న సినిమాలను చూశాక బాలీవుడ్ లో ఇమ్రాన్ హష్మీ లాగా తయారవుతున్నాడు అనే ట్రోల్స్ కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన గత చిత్రం “ఖుషీ” సినిమా సమయంలో సమంతతో విజయ్ దేవరకొండ చేసిన రొమాన్స్ ను చూశాక ఈ ట్రోల్స్ మరింత ఎక్కువయ్యాయి. విజయ్ దేవరకొండ సినిమా అంటే ముద్దు సీన్లు, రొమాన్స్ ఘాటుగా ఉండాల్సిందే అన్నట్టుగా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ గురించి రోజుకో వార్త బయటకు వస్తోంది.

కొంతకాలం క్రితం విజయ్ దేవరకొండ, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందాల్సిన “విజయ్ దేవరకొండ 12” సినిమా కొంతవరకు షూటింగ్ జరిగిన తర్వాత ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే త్వరలోనే ఈ ప్రాజెక్టును మళ్ళీ పట్టాలెక్కించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే #VD12 లో హీరోయిన్ ఎవరు అన్న విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. నిజానికి ముందుగా ఈ సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా అనుకున్నారు. ఆ తర్వాత శ్రీలీలను తప్పించి, రష్మిక హీరోయిన్ గా ఈ మూవీ రూపొందనుంది అనే వార్తలు వైరల్ అయ్యాయి. కానీ తాజాగా #VD12లో యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రి హీరోయిన్ గా నటించబోతోంది అనే ప్రచారం జోరుగా నడుస్తోంది.

- Advertisement -

“యానిమల్” సినిమాలో తృప్తి దిమ్రి ఎలాంటి రోల్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏకంగా సిల్వర్ స్క్రీన్ పై ఒంటిపై నూలు పోగు లేకుండా కనిపించి సంచలనం క్రియేట్ చేసింది. ఇకపై తను చేయబోయే సినిమాల్లో కూడా న్యూడ్ సీన్స్ చేయాల్సి వస్తే చేస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పేసింది. ఇక ఈ బోల్డ్ బ్యూటీ, విజయ్ దేవరకొండ లాంటి హీరోకు జత కలిస్తే వాళ్ళిద్దరి రొమాన్స్ వెండి తెరపై చూడతరమా? రొమాన్స్ హద్దులు దాటి సినిమా పెద్దలకు మాత్రమే అనేలా ఉంటుందేమో అంటున్నారు నెటిజెన్లు.

అయితే #VD12లో హీరోయిన్ల వేటలో ఉన్న మేకర్స్ ఇప్పటికే తృప్తిని ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సంప్రదించారని, ఒకవేళ ఆమె డేట్స్ సర్దుబాటు చేయలేకపోతే, “సప్త సాగరాలు దాటి” సేమ్ రుక్మిణి వసంత్ ను కూడా ఈ సినిమా కోసం తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. మరి చివరకు #VD12లో హీరోయిన్ గా నటించే అవకాశం ఎవరికీ దక్కుతుందో చూడాలి.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood newsMovie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు