Pawan Kalyan: పవన్ టాలెంట్ కి తారాలోకం ఫిదా.. ఏంటో చదివేయండి..!

సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే హీరోలు కేవలం నటనకు మాత్రమే పరిమితమవుతారు అంటూ కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు ఆ హీరోలలో ఉండే టాలెంట్ బయటపడితే మాత్రం నిజంగా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి టాలెంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉందని తెలిసి ఆయన అభిమానులే కాదు తారలోకం కూడా ఫిదా అవుతోంది. కేవలం తెలుగులోనే తన సినిమాలను విడుదల చేస్తున్నప్పటికీ కూడా దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న ఏకైక స్టార్ హీరో పవన్ కళ్యాణ్ అనడంలో సందేహం లేదు.

హీరోగా, డైరెక్టర్ గా, డాన్సర్ గా, రాజకీయ నాయకుడిగా కూడా పలు రంగాలలో అనుభవం పొందిన ఈయన ఇప్పుడు కొరియోగ్రాఫర్ గా కూడా తనలో ఉన్న టాలెంట్ నీ బయటపెట్టారు. ఘోస్ట్ రైటర్ గా కొన్ని సినిమాలకు పని చేసిన ఈయన తన చిత్రాలలో కొన్ని సన్నివేశాలను తానే రాస్తూ ఉంటారు. అలాగే కొన్ని సినిమాలలోని పాటల పిక్చరైజేషన్ అండ్ కొరియోగ్రఫీ కూడా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే గుడుంబా శంకర్, జానీ వంటి సినిమాలలో పవన్ పాటలకి కొరియోగ్రఫీ చేశారన్న విషయం చాలామందికి తెలియదు.

అంతేకాదు పవన్ కళ్యాణ్ ఇటీవల నటించిన బ్రో సినిమాలో కూడా ఒక పాటకి చాలా వరకు స్టెప్స్ ఆయనే కంపోజ్ చేశారని సమాచారం. బ్రో మూవీలో మై డియర్ మార్కండేయ అనే పబ్ పాట అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇందులో పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ తో పాటు బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌటేలా స్టెప్స్ వేసిన విషయం తెలిసిందే.. ఈ పాటకి గణేష్ స్వామి, భాను ఈ పాటకి కొరియోగ్రఫీ చేశారు. ఇకపోతే ఈ పాటలో ఊర్వశి వేసిన చాలా స్టెప్స్ ని పవన్ కళ్యాణ్ కొరియోగ్రఫీ చేశారట.

- Advertisement -

అయితే ఈ విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఊర్వశి బయట పెట్టడం గమనార్హం. ఇకపోతే పవన్ కి సినిమా మీద చాలా అవగాహన ఉందని. డైరెక్షన్ నుంచి ఎడిటింగ్ వరకు ప్రతిదీ ఆయనకు తెలుసు అని ఆమె తెలిపారు. ఇటు సినిమాతో పాటు అటు పాలిటిక్స్ లో కూడా చేసే పవన్ ని మల్టీ టాలెంటెడ్ అంటారు అంటూ ప్రశంసలతో ముంచెత్తారు ఊర్వశి.

ఇకపోతే పవన్ కళ్యాణ్ కెరియర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు రాజకీయాల కారణంగా వాటిని పూర్తిగా పక్కన పెట్టేశారు. పవన్ కళ్యాణ్ ఓజీ, ఉస్తాధ్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలు చేయాల్సి ఉండగా ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ పూర్తయిన వెంటనే ఆయన ఈ షూటింగ్స్ ని మొదలు పెడతారని సమాచారం.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు