Chiranjeevi: చిరు వేల కోట్ల ఆస్తుల వెనుక వున్నది ఆయనేనా..?

Chiranjeevi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. స్వయంకృషితో ఇండస్ట్రీలో ఎదిగి ఇప్పుడు ఇండస్ట్రీకే పెద్దదిక్కుగా మారిన ఈయన తన కుటుంబం నుంచి కూడా పదుల సంఖ్యలో హీరోలను తయారుచేసి ఇండస్ట్రీకి పరిచయం చేశారనే చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా హీరోలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో ఎన్నో అవమానాలు ఇబ్బందులను ఎదుర్కొన్న ఈయన ఆ తర్వాత నిలదొక్కుకొని నేడు రూ.వేల కోట్ల ఆస్తులకు అధిపతి కూడా అయ్యాడు. ఇకపోతే తాను సంపాదించిన ఈ డబ్బు వెనుక అసలు ఎవరు ఉన్నారు? అనే విషయాలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.

తాజాగా ఈ విషయాలను చిరంజీవి ఇటీవల ఎన్టీఆర్ 28వ వర్ధంతి వేడుకలలో పాల్గొని తన ఆస్తులు వెనుక ఉన్న అసలు వ్యక్తి గురించి వెల్లడించారు. ప్రస్తుతం విశాఖపట్నంలో లోక నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పుణ్యతిథి, ఏఎన్ఆర్ శత జయంతి వేడుకలు జరుగుతున్నాయి.. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు.ఈ నేపథ్యంలోనే చిరంజీవి వారిద్దరితో తనకున్న అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీలో తనకు అప్పుడప్పుడే మంచి పేరు వస్తున్న సమయంలో ఎన్టీఆర్ ఇచ్చిన సలహా తన కుటుంబాన్ని కాపాడింది అని ఆయన గుర్తు చేసుకోవడం గమనార్హం.

చిరంజీవి మాట్లాడుతూ… ఒకసారి నేను ఎన్టీఆర్ ను కలవడానికి వెళ్ళినప్పుడు.. ఆయన నన్ను పిలిచి రండి బ్రదర్ కూర్చోండి.. మీరు బాగా వృద్ధిలోకి వస్తున్నారు.. అయితే మీ సంపాదనని ఇనుప ముక్కల (కార్)కోసం వృధా చేసుకోవద్దు.. మంచి ఇల్లు కట్టుకోండి.. స్థలాలు తీసుకోండి అంటూ ఎన్టీఆర్ సలహా ఇచ్చారు. స్టార్ డం అనేది ఎప్పుడూ ఉంటుందో.. ఎప్పుడు పోతుందో కూడా తెలియదు.. మన సంపాదనని దాచిపెట్టుకోవాలి అని ఆయన సలహా ఇచ్చారు. ఇక ఆ సలహాలనే నేను దృష్టిలో పెట్టుకొని సినిమాల ద్వారా వివిధ మార్గాల ద్వారా సంపాదించిన డబ్బులు రియల్ ఎస్టేట్ రంగంలో పొదుపు చేశాను.. ఇక ఆయన సలహాలను ఫాలో అవ్వడం వల్ల నేడు వేలకోట్ల ఆస్తులకు అధిపతి అయ్యాను అంటూ ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చారు.

- Advertisement -

ఇకపోతే ఎన్టీఆర్ చెప్పే వరకు తనకు కార్లు అంటే చాలా ఇష్టం ఉండేది అని.. మార్కెట్లోకి కొత్త కారు వస్తే ఎలాంటి కారు కొనాలి అని ఆలోచించేవాడిని అయితే ఎన్టీఆర్ చెప్పిన తర్వాత ఆ సలహాని పాటించాను.. ఆ సలహా ఇప్పుడు నన్ను నా కుటుంబాన్ని కాపాడింది అంటూ ఎన్టీఆర్ చెప్పిన విషయాలను గుర్తు చేసుకున్నారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు