Chiranjeevi : 9 ఏళ్ళకి టెలికాస్ట్.. చిరు ఇంద్రకి సాలిడ్ రేటింగ్..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన “ఇంద్ర” సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 22యేళ్ళ కింద రిలీజ్ అయిన ఆ సినిమా చిరంజీవికి ఎనిమిదో ఇండస్ట్రీ హిట్ ని ఇవ్వగా, టాలీవుడ్ లో 30 కోట్ల కి పైగా షేర్ సాధించిన తొలి సినిమా గా నిలిచింది. అప్పట్లోనే 122 సెంటర్లలో 100 రోజులాడిన ఈ సినిమా 32 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. ఇక 33 కోట్ల షేర్ సాధించిన ఇంద్ర రికార్డులను బ్రేక్ చేయడానికి పోకిరి దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది.

ఇక ఈ సినిమా బుల్లితెరపై కూడా ఎప్పుడు టెలికాస్ట్ అయినా టిఆర్పి రేటింగ్ లు బద్దలయ్యేవి. అయితే జెమినీ టీవీ లో ప్రసారమయ్యే ఇంద్ర సినిమా కొన్నేళ్లుగా టెలికాస్ట్ కాలేదు. కనీసం చిరు బర్త్ డే రోజైనా వేస్తారని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసినా అది జరగలేదు. చివరగా 2014 లో టెలికాస్ట్ కాగా, ఫైనల్ గా తొమ్మిదేళ్ల తరువాత ఇంద్ర మూవీ ఛానల్ రైట్స్ జెమినీ టీవీ నుండి జీ తెలుగు ఛానల్ వారు దక్కించుకోగా, 2023 లాస్ట్ వీక్ టెలికాస్ట్ చేయడం జరిగింది.

అయితే ఇంద్ర సినిమా తొమ్మిదేళ్ల తర్వాత రిలీజ్ అయినా కూడా కొత్త సినిమాల టిఆర్పి ల రేంజ్ లో ఇంద్ర వ్యూయర్షిప్ ని దక్కించుకుంది. ఇంద్ర ఏకంగా 5.66 టీఆర్పీ రేటింగ్ ని దక్కించుకోవడం విశేషం. ఇక చిరంజీవి బర్త్ డే స్పెషల్ గా ఇంద్ర సినిమాని రీ రిలీజ్ చేయమని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా లో రచ్చ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు