Mahesh – Rajamouli Project : మహేష్ కు రాజమౌళి కండిషన్స్… ఈ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే…

Mahesh – Rajamouli Project : మహేష్ బాబు ఇకపై బయట కనిపించబోరా? నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం రాజమౌళి పెడుతున్న కండిషన్స్ కు ఈ హీరో కాంప్రమైజ్ అయ్యాడా? ఇంతకీ రాజమౌళి రూల్స్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

సూపర్ స్టార్ మహేష్ బాబు “గుంటూరు కారం” సినిమా రిజల్ట్ ను పక్కన పెట్టేసి ఇప్పుడు రాజమౌళితో తాను చేయబోయే నెక్స్ట్ మూవీపై కాన్సెంట్రేట్ చేస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా రూపొందబోతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మహేష్ బాబు మార్చిలో ఈ మూవీ సెట్స్ లో జాయిన్ కాబోతున్నారు. అయితే జక్కన్నతో సినిమా అంటే ఎంతటి స్టార్ హీరో అయినా ఆయన పెట్టే కండిషన్స్ ను పాటించాల్సిందే. రాజమౌళి ప్రాజెక్టుతో సహా హీరోను కూడా తన కంట్రోల్ లోకి తీసుకుంటారు.

పైగా సినిమా చేసే ముందే ఆ హీరోకు తన రూల్స్, డిమాండ్స్ ఏంటో చెప్పేస్తాడు. అలాగే ఆయనతో సినిమా అంటే సంవత్సరాలు పడుతుంది అని హీరోలు ఫిక్స్ అయిపోవాల్సిందే. అన్నింటికీ ఓకే అన్న హీరోతోనే రాజమౌళి ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. ఇలా రాజమౌళితో పనిచేసే హీరోకు ఖచ్చితంగా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అలా తలవంచారు కాబట్టే ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలు ఆయనతో సినిమా చేయడం, ఫ్యాన్ ఇండియా స్టార్లుగా ఎదగడం జరిగింది. ఇక ఇప్పుడు మహేష్ బాబు వంతు వచ్చింది. ఈ సినిమా ఏకంగా రెండేళ్ల పాటు షూటింగ్ మోడ్ లో ఉండనుంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని రాజమౌళి, మహేష్ మూవీ 2026 లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఇంతకీ మహేష్ బాబుకు రాజమౌళి పెట్టిన కండిషన్స్ ఏంటి? అంటే..

- Advertisement -

షూటింగ్ సమయంలో పబ్లిక్ గా కనిపించకూడదని రాజమౌళి మహేష్ బాబును ఆదేశించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి బ్రాండ్లు, ఎండార్స్మెంట్ల ద్వారా మహేష్ బాబు భారీగా సంపాదిస్తున్నారు. అయితే రాజమౌళితో సినిమా చేస్తున్నంత కాలం మహేష్ బ్రాండ్స్ కు సంబంధించిన ప్రమోషన్స్, యాడ్స్ వంటి వాటికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఇక మహేష్ బాబు పక్కా ఫ్యామిలీ మెన్. అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే పర్సన్. తరచుగా తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు.

కానీ ఈ సినిమా కోసం తన లుక్ ను సీక్రెట్ గా ఉంచాలి అంటే మహేష్ ఇప్పటినుంచి ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఆ విషయంలో కూడా మహేష్ అప్రమత్తంగా ఉండాలి. కచ్చితంగా ఈ రెండు రూల్స్ ను మహేష్ బాబు పాటించి తీరాల్సిందే. కాగా ఈ సినిమా కోసం మహేష్ బాబు భారీ పారితోషకం డిమాండ్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇక సినిమాలో మహేష్ ఒక్క టెస్ట్ లుక్ పూర్తి కావడానికి ఏకంగా నెల సమయం పడుతుందని, అది కూడా మార్చిలో జరుగుతుందని, ఇప్పటికే రాజమౌళి మహేష్ లుక్ కి సంబంధించిన కొన్ని స్కెచ్ లను లాక్ చేశాడని సమాచారం.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood newsMovie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు