Rajamouli: రాజమౌళి తన రూ.వేల కోట్ల ఆస్తిని ఏం చేస్తున్నారో తెలుసా..?

Rajamouli:  సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా టాప్ మోస్ట్ లిస్ట్ లో పేరు సంపాదించిన వారిలో రాజమౌళి కూడా ఒకరు. తెలుగు సినీ ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ చేసిన ఘనత కేవలం రాజమౌళికే దక్కుతుంది. తెలుగు ఇండస్ట్రీ గౌరవాన్ని సైతం పెంచేల రాజమౌళి ఎన్నో చిత్రాలను తెరకెక్కించారు.. తెలుగు యాక్టర్స్ ను కూడా గ్లోబల్ స్టార్ గా ఆస్కార్ అవార్డు వరకు వెళ్లేలా చేశారు రాజమౌళి.. తెలుగు సినీ ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన ఏకైక హీరో రాజమౌళి మాత్రమే..

ఎస్ఎస్ రాజమౌళి.. సక్సెస్ ని తన ఇంటి పేరుగా మార్చేసుకున్నారు. ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలలోకి తెలుగు ఇండస్ట్రీ నెంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పవచ్చు. అందుకు కారణం రాజమౌళి అనడంలో సందేహం లేదు.. ముఖ్యంగా మగధీర, ఈగ, బాహుబలి, RRR వంటి చిత్రాలతో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకొని సరికొత్త చరిత్ర ను తిరగరాశారు రాజమౌళి. ఒక్కో సినిమాకి హై రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉండడమే కాకుండా కొన్ని చిత్రాలకు లాభాలలో వాటాలను కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అయితే రాజమౌళి ఎంత సంపాదించినప్పటికీ.. తాను ఖర్చు చేసే ఒక్క రూపాయి కూడా దగ్గరుండి కౌంట్ చేస్తూనే ఉంటారట.. అంతేకాకుండా డబ్బుకు చాలా ఇంపార్టెంట్ అని.. ఒకవేళ అది పోతే మళ్ళీ తిరిగి రాదని రాజమౌళి భావిస్తూ ఉంటారు. అందుకే ఆ డబ్బుని ఫ్యూచర్ కోసం సేవ్ చేసుకోవడంలో ముందుంటారని.. ఇటీవల రాజమౌళి భార్య కూడా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలియజేసింది..

- Advertisement -

రాజమౌళి ఎక్కువగా ఫుడ్ బిజినెస్ , రియల్ ఎస్టేట్ లో ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారట. సినిమాలలో మాత్రం ఇన్వెస్ట్ చేయడానికి రాజమౌళికి ఇష్టం లేదట.. అందుకు రీజన్ తెలియదు కానీ రాజమౌళి కొన్ని సినిమాలు తీసిన తర్వాత ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చేసి.. వ్యవసాయ బాటలో పయనించే విధంగా ప్లాన్ చేసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.. రాజమౌళి ప్రస్తుతం సినిమాల విషయానికి వస్తే.. మహేష్ బాబుతో ఒక సినిమా చేసిన తర్వాత ఎన్టీఆర్ తో మరొక సినిమా చేసి చివరిగా మహాభారతం సినిమాని తెరకెక్కించి ఆ తర్వాత ఇండస్ట్రీ కి గుడ్ బై చెప్పబోతున్నట్టు సమాచారం.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు