Amani: 6 సార్లు అబార్షన్ చేయించుకున్న ఆమని.. వెలుగులోకి నిజాలు..!

అలనాటి సీనియర్ స్టార్ హీరోయిన్ ఆమని అందానికి ప్రతిరూపమే కాదు.. సాంప్రదాయానికి నిలువెత్తు రూపం కూడా.. తన అందంతో నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుని ఫ్యామిలీ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న ఆమని.. అటు గ్లామర్ రోల్స్ కూడా పోషించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.. తెలుగు తమిళ్, కన్నడ భాషలలో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈమె మొదట ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో నరేష్ హీరోగా వచ్చిన జంబలకడిపంబ సినిమా ద్వారా హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది

ఆమని నటించిన చిత్రాలు.. అవార్డులు..
అప్పట్లో ఈమె నటించిన చిత్రాలలో శుభసంకల్పం, మిస్టర్ పెళ్ళాం, శుభలగ్నం, అమ్మ దొంగ లాంటి చిత్రాలు భారీ విజయాన్ని అందించాయి..అంతేకాదు ఈమె తన నటనతో రెండు సార్లు నంది అవార్డులను కూడా దక్కించుకుంది. అలాగే ఫిలింఫేర్ అవార్డులు కూడా లభించాయి.. ఇకపోతే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈమె పెద్ద పెద్ద హీరోల నుంచి ఇప్పుడు వస్తున్న చిన్న హీరోల వరకు తల్లి అత్త పాత్రలు పోషిస్తూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. అంతే కాదు కొన్ని టీవీ షోలకి జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది ఆమని..

ఆమని వ్యక్తిగత జీవితం..
ఆమని సినీ జీవితం గురించి అందరికీ తెలుసు కానీ వ్యక్తిగత జీవితం ఎవరికి తెలియదనే చెప్పాలి.. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమని తల్లి అవడం వెనుక ఉన్న కష్టాన్ని వెల్లడించింది.. ఆమని మాట్లాడుతూ.. నాకు పిల్లలంటే చాలా ఇష్టం.. పెళ్లి జరిగిన తర్వాత చాలా సంవత్సరాలకు పిల్లలు పుట్టారు.. ఎంతమంది డాక్టర్స్ కి చూపించినా.. నా ప్రాబ్లం ఏ డాక్టర్ కూడా గుర్తించలేకపోయారు. ఇక దేవుడి మీద భారం వేసి ప్రతిసారి నాకు బిడ్డ పుట్టాలని కోరుకునేదాన్ని. అప్పటికే ఆరుసార్లు అబార్షన్స్ కూడా జరిగాయి.. అసలు అన్ని సార్లు ఎందుకు అబార్షన్స్ జరుగుతున్నాయో ఏ డాక్టర్ కూడా కనిపెట్టలేకపోయారు. అయితే ఒక డాక్టర్ ఒకసారి నీ కేసు నేను చూడలేను అంటూ నా ఫైల్ నాకే ఇచ్చేసి ఇంటికి పంపించారు.. దాంతో ఏం చేయాలో అర్థం కాలేదు.. ఇక దేవుడు మీదే భారం వేశాను.. ఏడవసారి ప్రెగ్నెన్సీ వచ్చింది.. అయితే ఒక డాక్టర్ గుర్తించి చిన్న పరిష్కారంతో నా పెద్ద సమస్యకి పరిష్కారం చూపించారు. అప్పుడు నా ప్రెగ్నెన్సీ నిలబడింది..ఒక బిడ్డకి జన్మనిచ్చాను. ఆ తర్వాత మరో ఇద్దరు పిల్లలు పుట్టారు.. ఇదంతా దేవుడి దయ వల్లే జరిగింది.. అప్పటివరకు పిల్లలు లేక ఎంతో సతమతమవుతున్న నాకు డాక్టర్ రూపంలో దేవుడు వచ్చి నా సమస్యకి పరిష్కారం చూపించి.. నన్ను తల్లిని చేశారు అంటూ ఎమోషనల్ అయింది ఆమని.. ఇక తల్లి అని పిలిపించుకోవడం వెనుక ఎంత కష్టం ఉంటుందో గుర్తుచేసుకొని మరీ ఎమోషనల్ అయింది ఈ ముద్దుగుమ్మ.. ఇక ఆమని చేసిన ఈ కామెంట్లు విని అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు..

- Advertisement -

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు