Aamani: బట్టలిప్పి అ** చూపించమన్నారు.. క్యాస్టింగ్ కౌచ్ పై ఆమని షాకింగ్ కామెంట్స్.!

ప్రముఖ సీనియర్ నటి ఆమని తన అందం అభినయంతో అప్పటి సినీ ప్రేక్షకులను కట్టిపడేసింది.  ఈమె నటించిన సినిమాలన్నీ కూడా ఇప్పటికీ టీవీలో వచ్చినా..  చాలామంది కుటుంబ కథా ప్రేక్షకులు టీవీలకు అతుక్కుని మరీ చూస్తూ ఉంటారు. అంతలా హీరోయిన్ గా ఈమె చేసిన సినిమాలు ప్రేక్షకులను అలరించాయని చెప్పవచ్చు.  మొదటిగా వీ.కే. నరేష్ సరసన జంబలకడిపంబ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఆమని తన పాత్రకు మంచి రెస్పాన్స్ రావడంతో అమ్మ దొంగ , మావిచిగురు, ఘరానా బుల్లోడు, శుభసంకల్పం, శ్రీవారి ప్రియురాలు , అమ్మ దీవెన,  ఆ నలుగురు వంటి ఎన్నో సినిమాలలో నటించి మంచి పేరు దక్కించుకుంది. కెరియర్ పీక్స్ లో ఉండగానే వివాహం చేసుకున్న ఆమని వివాహం అనంతరం సినిమాలకు దూరమయింది. ఆ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి ఈమె..  అమ్మ, అత్త  పాత్రలలో నటిస్తూ మరింత బిజీగా మారింది. అలా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, శ్రీనివాస కళ్యాణం, చావు కబురు చల్లగా, చందమామ కథలు, వినరో భాగ్యం విష్ణు కథ వంటి సినిమాలలో నటించి ఇప్పటికీ తెలుగు ఆడియన్స్  ను అలరిస్తోంది ఆమని.
గతంలో సోషల్ మీడియా అందుబాటులో లేదు కాబట్టి క్యాస్టింగ్ కౌచ్ పై పెద్దగా స్పందించని ఈమె.. ప్రస్తుతం తాను ఎదుర్కొన్న చేదు ఘటనల గురించి బయట పెట్టింది.. గతంలో కోలీవుడ్ లో ఒక సినిమా చేసేటప్పుడు నన్ను స్విమ్ సూట్ వేసుకొని స్విమ్మింగ్ చేయమన్నారు.. అయితే నేను ఈ పాత్రకి ఒప్పుకునే ముందే డైరెక్టర్ నీ డ్రెస్ మొత్తం విప్పెయ్యి .. ముడతలు ఉన్నాయేమో చూస్తాను అని అన్నాడు. దాంతో నాకు ఈ సినిమా వద్దు ఆ క్యారెక్టర్ వద్దు అంటూ అక్కడి నుంచి వచ్చేసాను. అయితే కోలీవుడ్ లో ఇలా జరగడం నాకు మరింత అవమానంగా అనిపించింది అంటూ ఆమె తెలిపింది..
ఆమని మాట్లాడుతూ.. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో క్యాస్టింగ్ కౌచ్ అంటే పెద్దగా తెలియదు.. దర్శక నిర్మాతలు అప్పట్లో తమ మేనేజర్లను మీకు డైరెక్టర్ స్టోరీ చెబుతానన్నారు. ఒకసారి ఆయన రూమ్ కి రండి అని పిలిచేవారు. అసలు వాళ్ళు ఏమి ఆశించి అడుగుతున్నారో కూడా అర్థమయ్యేది కాదు. ఆ తర్వాత కొంతమంది మాత్రం మీ మమ్మీ వద్దు ఒక్కరే రండి అని చెప్పడంతో వీళ్ళు నా నుండి కమిట్మెంట్ కోరుతున్నారు అని అర్థమై.. అలా ఎన్నో సినిమాలను వదులుకున్నాను అంటూ తెలిపింది ఆమని. అంతేకాదు పెద్ద పెద్ద సంస్థల వాళ్ళు ఇలా చెయ్యలేదు అని.. చిన్న సంస్థల వాళ్లే ఇలా హీరోయిన్లను వేధిస్తారు అంటూ క్యాస్టింగ్ కౌచ్ పై పలు షాకింగ్ కామెంట్లు చేసింది ఆమని.

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు