Guntur Kaaram : చ*చ్చు పోయిస్తున్న మహేష్ ఫ్యాన్స్… ఆ మాత్రం భయం ఉండాలిలే!

సూపర్ స్టార్ మహేష్ బాబుకు టాలీవుడ్ లో ఉన్న ఫాలోయింగ్ ఎంతటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే కొంతకాలం నుంచి సైలెంట్ గా, క్లాస్ గా ఉంటూ వస్తున్న మహేష్ బాబు ఫ్యాన్స్ సడన్ గా వైలెంట్ అయిపోయారు. రీసెంట్ గా రిలీజ్ అయిన “గుంటూరు కారం” సెకండ్ సాంగ్ “ఓ మై బేబీ” విషయంలో వీళ్ళు చేసిన రచ్చ చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. ఆ వివాదం ప్రస్తుతం చల్లబడినప్పటికీ మేకర్స్ ను మాత్రం టెన్షన్ పెడుతోందట. అందుకే మేకర్స్ ఈ మూవీ నుంచి నెక్స్ట్ సాంగ్ రిలీజ్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయా అని ఆలోచిస్తున్నారని సమాచారం.

 

“గుంటూరు కారం” మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం ఇప్పటికే రెండు సాంగ్స్ ను రిలీజ్ చేసింది. అందులో “దమ్ మసాలా” అనే టైటిల్ సాంగ్ మహేష్ అభిమానులను ఊపేసింది. కానీ ఆ తర్వాత వచ్చిన “ఓ మై బేబీ” సాంగ్ మాత్రం ఆకట్టుకోలేదు. దీంతో స్వయంగా మహేష్ బాబు ఫ్యాన్స్ సాంగ్ ఏమాత్రం బాలేదంటూ సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందంపై ఒంటికాలితో లేచారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా పాటల రచయిత రామ జోగయ్య శాస్త్రి మహేష్ అభిమానులను కుక్కలతో పోల్చుతూ పోస్ట్ చేయడం వాళ్లను మరింత రెచ్చగొట్టింది. ఇక ఆ తర్వాత ఆయన సైలెంట్ గా సోషల్ మీడియా నుంచి పక్కకు తప్పుకోగా, నిర్మాత నాగ వంశీ చేసిన ట్వీట్లు ఆ వివాదానికి మరింత ఆజ్యం పోసాయి. దీంతో నెక్స్ట్ సాంగ్ బాగా లేకపోతే అప్పుడు చెబుతాం అంటూ నాగవంశీ ట్వీట్లకు సమాధానం చెప్పారు నెటిజెన్లు. ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ సాంగ్ రిలీజ్ విషయంలో చిత్ర బృందం మొత్తం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.

- Advertisement -

మహేష్ బాబు సైతం ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారట. ఇప్పటికే మహేష్ బాబు “గుంటూరు కారం” టీంని సాంగ్స్ పై రీ వర్క్ చేయమని, రీప్లేస్ చేయమని, లేదంటే మొత్తానికే సినిమా నుంచి ఒక పాటను తీసేయమని ఒత్తిడి చేస్తున్నాడని సమాచారం. అయితే “గుంటూరు కారం” మూవీ రిలీజ్ కు ఇంకా ఎక్కువ రోజులు లేకపోవడంతో చిత్ర బృందం అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేయాలనే టెన్షన్ లో ఉంది. ఇంకా మేకర్స్ రీ రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేయాల్సి ఉంది. పాటలపై ఫోకస్ పెట్టడానికి మేకర్స్ కి పెద్దగా సమయం లేదు. కానీ నెక్స్ట్ రిలీజ్ కాబోయే సాంగ్ ఏమాత్రం నిరాశపరిచినా మహేష్ బాబు ఫ్యాన్స్ ఒప్పుకొనే సిచువేషన్ లో లేరు. దీంతో నెక్స్ట్ సాంగ్ విషయంలో “గుంటూరు కారం” టీ మొత్తం రిలీజ్ చేస్తే ఒక బాధ చేయకపోతే ఒక బాధ అనే టెన్షన్ లో ఉంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు