Tollywood: ఇండస్ట్రీని టెన్షన్ పెడుతున్న కరోనా కొత్త వేరియంట్

మరోసారి కరోనా తన కోరలు చాస్తోంది. ఈ కరోనా మహమ్మారి తగ్గిపోయింది అనుకున్న ప్రతిసారి కొత్త వేరియంట్ల రూపంలో విజృంభిస్తుంది. ప్రస్తుతం పెరుగుతున్న కొత్త కరోనా కేసులు సినీ పరిశ్రమను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గతంలో వచ్చిన రెండు కరోనా వేవ్స్ తెలుగు సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపించిన సంగతి అందరికీ తెలిసిందే. ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు కరోనా దెబ్బకు యావత్ భారతీయ చలనచిత్ర పరిశ్రమ అతలాకుతలమైంది. ప్రస్తుతం పెరుగుతున్న కరుణ కొత్త వేరియంట్ కేసులతో సినీ పరిశ్రమ వణికిపోతోంది.

థియేటర్ యజమానులు, నిర్మాతలు, నటీనటులు ఇలా ఎవరిని వదలకుండా సామాన్య ప్రజలతో పాటు ఇండస్ట్రీకి చెందిన 24 క్రాఫ్ట్స్ వారు గతంలో వచ్చిన రెండు కరోనా వేవ్స్ కు అల్లాడిపోయారు. ఒకవేళ మళ్లీ అదే ట్రైన్స్ లో కొత్త వేరియంట్ కారణంగా కరోనా కేసులు పెరిగితే ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని మళ్లీ థియేటర్లు మూసివేసే అవకాశం ఉంది. ప్రజలను ఎంటర్టైన్ చేసే విషయాల్లో అత్యంత ప్రభావితమైన రంగాలలో సినిమా రంగం కూడా ఒకటి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం కొత్తగా పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు కేరళలో ప్రారంభమై హైదరాబాద్ వరకు వచ్చేసాయి. కొత్త కరోనా వేరియంట్ వ్యాప్తి గురించి ఆరోగ్యశాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తూ, జాగ్రత్తగా ఉండమని పలు సూచనలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ వారాంతంలో “సలార్” వంటి పెద్ద సినిమాలు విడుదల కావడంతో పాటు సంక్రాంతికి అనేక పెద్ద సినిమాలో లైన్లో ఉండడం చిత్ర పరిశ్రమకు ఆందోళన కలిగించే అంశం.

- Advertisement -

ఫస్ట్, సెకండ్ వేవ్ లలో లాగా ఈసారి కూడా కేసులు పెరుగుతూ పోతే సినీ పరిశ్రమకు మరొక పెద్ద దెబ్బ పడినట్టే. ఇప్పుడిప్పుడే తిరిగి పుంజుకుంటున్న చిత్ర పరిశ్రమపై పెద్ద బండ పడినట్టే. ఆ విషయమే ఇప్పుడు టాలీవుడ్ ను టెన్షన్ పెడుతోంది. ఇక కొత్త విషయానికి వస్తే… JN1 అని ఈ వేరియంటుకు పేరు పెట్టారు. కేరళలతో సహా పలు రాష్ట్రంలో ఇప్పటికే స్పీడ్ గా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇక తెలంగాణలో కూడా నాలుగు కొత్త కేసులు నమోదయ్యాయి.

నిన్న 400 మందికి పైగా కోవిడ్ టెస్ట్ చేస్తే, అందులో 9 మందికి కరోనా పాజిటివ్ అని తేలడం వైద్యులను సైతం భయభ్రాంతులకు గురిచేస్తోంది. అయితే ఈ తొమ్మిది కేసుల్లో ఎన్ని కొత్త వేరియంట్లు ఉన్నాయో ఇంకా తెలియ రాలేదు. కానీ కేరళలో మాత్రం గంటల వ్యవధిలో వందల కేసులు నమోదు అవుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అక్కడ గత 24 గంటల్లో 115 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కేరళలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,749కి చేరుకుంది.

check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు