Prabhas: ఆస్తిలోనూ మన డార్లింగ్ డైనోసారే… ఎన్ని వేల కోట్లకు వారసుడో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఆయనతో నటించిన నటీనటులు అందరూ ఎంతో గొప్పగా చెబుతూ ఉంటారు. ప్రభాస్ చూపించే ప్రేమ, ఆప్యాయతతో పాటు ఆయన ఉదార స్వభావం గురించి ఇప్పటివరకు ఎంతోమంది సెలబ్రిటీలు బహిరంగంగానే వెల్లడించారు. మరి ఇంతటి మంచి మనసు ఉన్న ప్రభాస్ రియల్ లైఫ్ ఎలా ఉంటుంది అని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా?

ఆయనకేం మంచి బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలో పుట్టాడు. బతకడానికి కావలసిన వాటన్నిటితోపాటు పాన్ ఇండియా స్టార్ క్రేజ్ కూడా తోడైంది. కాబట్టి బాగా లగ్జరీగా లైఫ్ ను లీడ్ చేస్తాడు అని అనుకుంటున్నారా? అయితే అది నిజమే. ప్రభాస్ క్రేజ్ గురించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు అందరికీ తెలుసు. ప్రభాస్ బ్యాక్ గ్రౌండ్, ఆయన సినిమాల్లోకి ఎలా వచ్చాడు అనే విషయం కూడా చాలామందికి తెలుసు. మరి ఇప్పుడు వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న మన బాహుబలి ఎన్ని వేల కోట్లకు వారసుడు? అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. ఆ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రభాస్ కెరియర్ బాహుబలి కి ముందు ఆ తర్వాత అన్నట్టుగా మారింది. బాహుబలితో డార్లింగ్ కు వరల్డ్ వైడ్ గా భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఈ హీరో ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ఉన్న బ్యాక్ గ్రౌండ్ నుంచి ఎంట్రీ ఇవ్వడంతో ఈయన కూడా ఒక స్టార్ కిడ్ అని చెప్పొచ్చు. ప్రభాస్ తండ్రి గోపికృష్ణ మూవీస్ బ్యానర్ నిర్మాణ సంస్థ అధినేత, ఆయన పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు ఒకప్పటి టాలీవుడ్ దిగ్గజ నటుడు. ఇంత పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్న ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజు వారసుడిగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు.

- Advertisement -

అయితే మొదటి సినిమా నుంచి కష్టపడి ప్రభాస్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఆ క్రమంలో ఎన్నో హిట్లు, మరెన్నో ప్లాపులు టేస్ట్ చేశాడు. ఇక బాహుబలితో ఫ్యాన్ ఇండియా స్టార్ గా అదృష్టం కలిసి వచ్చింది. అనంతరం ఈయన రెమ్యూనరేషన్ భారీగా పెరిగిపోయింది. బాహుబలి కంటే ముందు ప్రభాస్ నెట్ వర్త్ 124 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ హీరో ఒక్కో సినిమాకు సుమారు 150 కోట్ల వరకు పారితోషకం అందుకుంటున్నాడు. ఇలా ఆయన కేవలం సినిమాల్లోకి వచ్చిన ఎనిమిది ఏళ్లలో తన పారితోషకం, బ్రాండ్ ఎండార్స్మెంట్లతో కలిపి ప్రభాస్ ఆస్తులు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం ప్రభాస్ ఆస్తి 251 కోట్లు ఉంటుందని అంచనా.

ప్రభాస్ కు హైదరాబాదులో 60 కోట్ల విలువైన ఇల్లు, శివార్లలో రాయదుర్గ ఖల్సాలో ఫామ్ హౌస్, ఇటలీలో ఓ లగ్జరీ ఫ్లాట్ ఉన్నాయి. ఈ ఫ్లాట్ కి తక్కువలో తక్కువ 4.8 కోట్ల అద్దె ఉంటుందని సమాచారం. ఇక వీటితో పాటు కోటి రూపాయల విలువైన రేంజ్ రోవర్ స్పోర్ట్స్, రెండు కోట్ల బీఎండబ్ల్యూ 7 సిరీస్, రెండు కోట్ల మెర్సిడెస్ బెంజ్, 8 కోట్ల రోల్స్ రాయిస్ ఫాంటమ్ వంటి అత్యంత ఖరీదైన కార్లు ప్రభాస్ షెడ్డులో ఉన్నాయి. ఇలా ప్రభాస్ తన పేరుకు తగ్గట్టే రాజులా బతుకుతున్నాడు. ఇంతటి లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్న మన డైనోసార్ “సలార్” మూవీతో డిసెంబర్ 22న థియేటర్లలోకి రాబోతున్న విషయం తెలిసిందే.

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు