2. Bigg Boss: గెలిపించండి అన్నాడు ఇప్పుడు పరారీ లో ఉన్నాడు.

ఒక ప్రముఖ ఛానల్ నిర్వహిస్తున్న బిగ్బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదట ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరించిన ఈ షో కి మంచి రెస్పాన్స్ సాధించింది. చాలామంది తెలిసిన సెలెబ్రిటీస్ మొదటి సీజన్ లో ఉండడంతో చాలామందికి ఒక క్యూరియాసిటీ పెరిగి ఈ షో పైన ఆసక్తి పెరిగింది. తర్వాత ఈ షో కి తెలిసిన వాళ్ళకంటే కూడా తెలుసుకోవలసిన వాళ్లు ఎక్కువైపోయారు. ఈ షో కి సెలబ్రిటీగా వచ్చిన వారిని ఇంతకుముందు వీళ్ళు ఏం చేశారు అని కొంతమంది తెలుసుకోవడం మొదలుపెట్టారు.

సీజన్ సీజన్ దాటుతున్న కొద్ది దీనికి ఆదరణ కూడా పెరుగుతూ వచ్చింది. ఇకపోతే రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ సెవెన్ కూడా పూర్తయింది. ఈ సీజన్ సెవెన్ కూడా అందర్నీ బాగానే ఆకట్టుకుంది. అయితే ఈ సీజన్లో ఉల్టా పుల్టా కొన్ని ఎపిసోడ్లు సాగాయి. అయితే మొదట ఈ సీజన్లో కూడా కొద్దిమంది మాత్రమే తెలిసిన సెలబ్రెటీలు వచ్చారు. ఆ తర్వాత మిగతా వారి గురించి కూడా తెలుసుకోవాల్సి వచ్చింది. ఇకపోతే ఈ సీజన్ తో రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చాడు పల్లవి ప్రశాంత్.

మొదటి నుంచి పల్లవి ప్రశాంత్ పైన చాలామంది నటిస్తున్నాడు అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇకపోతే నన్ను గెలిపించండి గెలిపించండి అంటూ ఓట్లు అడిగిన పల్లవి ప్రశాంత్ గెలిచిన తర్వాత తన తీరు మొత్తం మారిపోయింది. గెలవటమే కాకుండా కొన్ని అల్లర్లకు కూడా దారి తీసేలా తన ప్రవర్తన కొనసాగింది. అన్నపూర్ణ స్టూడియో వద్ద చాలామంది అభిమానులు హాజరయ్యారు. అయితే బయట ఉద్రిక్తత ఉందని పల్లవి ప్రశాంతని సపరేట్గా ఒక రూట్లో పంపించి వెళ్ళిపోమన్నారు బిగ్ బాస్ యాజమాన్యం.

- Advertisement -

మళ్ళీ ఇటు రావద్దన్న కూడా పల్లవి ప్రశాంత్ ఓపెన్ టాప్ కారులో ప్రేక్షకులను పలకరించడానికి వచ్చే తరుణంలో ట్రాఫిక్ జామ్ అయిపోయి, చాలామంది బస్సులను కూడా అద్దాలను కూడా పగలగొట్టే స్థితికి వచ్చారు. దీంతో పల్లవి ప్రశాంత్ పైన కొన్ని సెక్షన్స్ లో కేసు నమోదు అయింది. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ పరారీ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇకపోతే కొంతమంది మీడియా వాళ్లకి కూడా ఇంటర్వ్యూ ఇవ్వటానికి పల్లవి ప్రశాంత్ నిరాకరించినట్లు కొంతమంది మీడియా పీపుల్ చెప్పుకొచ్చారు. ఏదేమైనా గెలిచిన తర్వాత ప్రశాంత్ ప్రవర్తించిన తీరు మారిపోయింది అనేది చాలామందికి ఒక క్లారిటీ వచ్చింది.

for more updates :

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు