90S: తొలి ప్రయత్నం లోనే హిట్ కొట్టిన శివాజీ..

టాలీవుడ్ లో చిన్న పాత్రలతో ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత హీరోగా పాపులర్ అయ్యి ప్రేక్షకులకు దగ్గరైన బహుముఖ ప్రజ్ఞాశాలి శివాజీ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 ద్వారా బుల్లితెరపై కూడా ఎంతో ఫాలోయింగ్ ని సంపాదించాడు. కొన్నేళ్ల వరకు సినిమాల పరంగా ఆఫర్లు తగ్గి స్ట్రగుల్ అయ్యి, పాలిటిక్స్ లో కి వెళ్లి ఫెయిల్ అయిన శివాజీ మళ్ళీ బిగ్ బాస్ షో ద్వారానే తన ఫాలోయింగ్ పెంచుకున్నాడు.

ముందు ఈ షో కి వెళితే శివాజీ పరువు పోతుంది అన్న వాళ్ళే శివాజీ, ఆటకు అతని మాస్టర్ బ్రెయిన్ కి కనెక్ట్ అయిపోయి, ఫైనల్ దాకా తీసుకొచ్చారు. ఇక బిగ్ బాస్ లో చాణక్య గా ప్రేక్షకులని అలరించి టాప్ 3 కంటెస్టెంట్ గా బయటికి వచ్చిన శివాజీ, కొన్ని రోజులపాటు ఇంటికే పరిమితమవగా, సోషల్ మీడియా బయట కూడా పలు ఇంటర్వ్యూ లతోనే చాలా రోజులు గడిపాడు. అయితే శివాజీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళక ముందే “90స్ మిడిల్ క్లాస్ ఫామిలీ స్టోరీ” అనే వెబ్ సిరీస్ లో నటించగా, ఆ మూవీ ప్రమోషన్లలో మొన్నటిదాకా పాల్గొనగా, తాజాగా ఈటీవీ విన్ లో రిలీజ్ చేసారు.

ఒక ఫన్& ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో శివాజీ ఒక మధ్యతరగతి తండ్రిగా జీవించాడని చెప్పాలి. ఇక ఈ వెబ్ సిరీస్ సోషల్ మీడియా లో మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, సాలిడ్ వ్యూస్ తో ఆడియన్స్ ని మెప్పిస్తుంది. ఇక శివాజీ రీ ఎంట్రీ ఇచ్చాక మళ్ళీ సినిమా ఆఫర్లు కూడా పొందుతుండగా, దాని కంటే ముందే, తాను నటించిన ఈ 90స్ వెబ్ సిరీస్ సూపర్ సక్సెస్ అవడం శుభ పరిణామం అని చెప్పాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు