2022 Sankranthi Recap : 2022 సంక్రాంతి విన్నర్ నాగార్జున… వార్ ఎవరెవరి మధ్య అంటే?

టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు సినీ ప్రియులు కూడా సంక్రాంతి సీజన్ కోసం ప్రతి ఏడాది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఎందుకంటే కంటెంట్ కాస్త అటు ఇటుగా ఉన్నప్పటికీ సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేస్తే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్ముతారు మేకర్స్. అందుకే స్టార్స్ అంతా సంక్రాంతిని టార్గెట్ చేస్తూ ఉంటారు. మరోవైపు ఫ్యామిలీతో కలిసి థియేటర్లలో సినిమాను చూడడానికి ఈ సీజన్లో ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తుంటారు. ప్రతి ఏడాది సంక్రాంతికి స్టార్ హీరోల మధ్య పోటీ నెలకొంటుంది. అలాగే ఈ ఏడాది కూడా ఏకంగా ఐదు సినిమాలతో బాక్స్ ఆఫీస్ ఫైట్ హోరాహోరీగా జరగబోతోంది. ఈ నేపథ్యంలో 2022లోకి టైం ట్రావెల్ చేసి అప్పట్లో సంక్రాంతికి ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి? అందులో విన్నర్ గా నిలిచింది ఎవరు? అనే విషయాలను తెలుసుకుందాం.

2022 సంక్రాంతి బరిలో హీరో, బంగార్రాజు, రౌడీ బాయ్స్, 1945, అతిథి దేవో భవ వంటి సినిమాలు నిలిచాయి. ఇందులో “బంగార్రాజు” మూవీ మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మరి ఈ సినిమాల బ్రేక్ ఈవెన్ ఏంటి? ఎంతవరకు కలెక్షన్లు రాబట్టాయి అన్న వివరాల్లోకి వెళ్తే…

1. బంగార్రాజు
అక్కినేని తండ్రి కొడుకులు నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన “బంగార్రాజు” మూవీ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ 2022 జనవరి 14న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అప్పట్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 39 కోట్లు కాగా, ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 66 కోట్ల గ్రాస్, తెలుగు రాష్ట్రాల్లో 35.75 కోట్ల షేర్, ప్రపంచవ్యాప్తంగా 39.15 కోట్ల షేర్ రాబట్టి నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టింది.

- Advertisement -

2. రౌడీ బాయ్స్
టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సోదరుడి కుమారుడు
ఆశిష్ రెడ్డి “రౌడీ బాయ్స్” మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన “రౌడీ బాయ్స్” మూవీకి శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ 2022 జనవరి 14న రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11.50 కోట్లు కాగా, ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ కేవలం 5.86 కోట్లను మాత్రమే కాబట్టి నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది.

3. హీరో
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ గల్లా, నిధి అగర్వాల్ జంటగా నటించిన హీరో మూవీ 2022 జనవరి 15న భారీ అంచనాలతో రిలీజ్ అయింది. మహేష్ బాబు మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అశోక్ గల్లాకు మొదటి మూవీనే షాక్ ఇచ్చింది. ఈ “హీరో” మూవీ పెట్టిన బడ్జెట్లో కనీసం 25 శాతం కూడా రికవరీ చేయలేకపోయింది. ఈ సినిమాతో పాటు రానా హీరోగా నటించిన “1945”, ఆది సాయి కుమార్ “అతిథి దేవో భవ” సినిమాలు కూడా 2022 సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా డిజాస్టర్ గా మిగలడంతో చివరకు అక్కినేని నాగార్జున, నాగచైతన్య ఆ ఏడాది సంక్రాంతి హీరోలుగా నిలిచారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు